Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త..!

ఆయన ఎంత స్టార్ పొలిటీషియన్ అయినా సరే తెర మీద పవర్ స్టార్ స్టైల్ ని చూసి తరించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 6:11 AM GMT
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త..!
X

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రోత్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్ సినిమాల పట్ల ఆయన చూపిస్తున్న అనాసక్తి కి కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. ఆయన ఎంత స్టార్ పొలిటీషియన్ అయినా సరే తెర మీద పవర్ స్టార్ స్టైల్ ని చూసి తరించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆయన అసలు సినిమాలు తీయడం మానేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు ఎప్పుడొస్తాయా అన్న ఎగ్జైట్ మెంట్ మాత్రం ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ల క్రితం మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా పూర్తి కాలేదు. మరో 8 రోజులు పవన్ షూట్ కి వస్తేనే కానీ అది పూర్తి అవ్వదట. మరోపక్క సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేస్తున్న పవన్ ఆ మూవీని పూర్తి చేయాల్సి ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఓజీ సినిమా గ్లింప్స్ తోనే వారెవా అనిపించింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సుజిత్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.

ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. అందుకే సంక్రాంతికి ఓజీ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఏంటి ఓజీ టీజర్ వస్తుందా అని ఫ్యాన్స్ సూపర్ జోష్ తెచ్చుకుంటున్నారు. 1:39 నిమిషాల నిడివితో ఓజీ టీజర్ వస్తుందని తెలుస్తుంది. పొంగల్ జోరు మరింత పెంచేలా ఓజీ టీజర్ రాబోతుంది. ఐతే ఈ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా అన్న అంచనాలు కూడా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఓజీ సినిమా తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా ఫ్యాన్స్ కి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. మరి ఓజీతో సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తారన్నది చూడాలి. సినిమా టీజర్ తో ఆ ప్రాజెక్ట్ రేంజ్ ఏంటన్నది చూపించాలని చూస్తున్నారు. సో ఫ్యాన్స్ అంతా టీజర్ కోసం సిద్ధంగా ఉండాల్సిందే.