Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు రీబూట్ అయ్యేది వ‌చ్చే వారం నుంచే?

ఏపీలో అకాల వ‌ర‌ద‌తో ఒక్క‌సారిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా షెడ్యూల్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:40 AM GMT
వీర‌మ‌ల్లు రీబూట్ అయ్యేది వ‌చ్చే వారం నుంచే?
X

ఏపీలో అకాల వ‌ర‌ద‌తో ఒక్క‌సారిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా షెడ్యూల్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. లేదంటే ఇప్ప‌టికే `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`, `ఓజీ` సినిమాల షూటింగ్ లు పున ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడా ప‌రిస్థితి నుంచి విజ‌య‌వాడ పూర్తిగా కోలుకోవ‌డంతో పీకే షూటింగ్ ల‌పై దృష్టి పెట్టారు. నిన్న‌టి రోజున `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు జ్యోతికృష్ణ‌-ర‌త్నంలు ప‌వ‌న్ తో స‌మాశ‌మైన సంగ‌తి తెలిసిందే.

దీంతో ప‌వ‌న్ కూడా టీమ్ అంద‌ర్నీ సిద్ద‌మ‌వ్వాల‌ని ఆదేశాలిచ్చారు. మ‌రో వారం రోజుల్లో షూటింగ్ మొద‌లు పెడ‌దామ‌నే భ‌రోసా క‌ల్పించారు. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో సినిమాకి అవ‌స‌ర‌మైన బ్లూమ్యాట్ సెట్ సిద్దం చేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద కంటే ముందే తాడేప‌ల్లి స‌మీపంలో సెట్స్ వేసుకోమ‌ని..అలాగైతే త‌న‌కి హాజ‌ర‌వ్వ‌డానికి ఇబ్బంది ఉండ‌ద‌ని భావించ‌డంతో వీర‌మ‌ల్లు టీం ఆ ర‌కంగా మూవ్ అవుతుంది.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ వ‌చ్చే వారం నుంచి `ఓజీ` కంటే ముందుగానే డేట్లు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌రిగ్గా 20 రోజులు డేట్లు కేటాయిస్తే అత‌ని పోర్ష‌న్ షూటింగ్ పూర్త‌వుతుంది. అందుకే ప‌వ‌న్ ముందుగా ఈ సినిమాకి డేట్లు కేటాయిస్తున్నారు. అటుపై `ఓజీ` చిత్రానికి డేట్లు ఇవ్వ‌నున్నారు. ఈ సినిమా కూడా స‌గానికి పైగా షూటింగ్ పూర్త‌యింది. పెండింగ్ కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ అండ్ కో భావిస్తుంది.

ఈ రెండింటి త‌ర్వాత `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` చిత్రానికి డేట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. వీర‌మ‌ల్లుకు సంబం ధించి షూటింగ్ పూర్త‌యిన వర‌కూ పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి చేస్తున్నారు. ప్ర‌త్యేకంగా సీజీకి స‌మ‌యం కేటాయించ‌కుండా దొరికిన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.