Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. మళ్లీ అదే జరిగిందా?

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాల అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్.. ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:18 AM GMT
హరిహర వీరమల్లు.. మళ్లీ అదే జరిగిందా?
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాల అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్.. ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్.. రీసెంట్ గా తన లైనప్ లో ఉన్న మూడు చిత్రాలపై మళ్లీ దృష్టి పెట్టారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు షూటింగ్ ను ముందుగా మొదలుపెట్టారు. పీరియాడిక‌ల్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతున్న మూవీ.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రం షూటింగ్ నాలుగేళ్ల క్రితమే స్టార్ట్ అయింది. అయితే పలు కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. కాస్త గ్యాప్ తర్వాత 2024లో మళ్లీ పట్టాలెక్కింది. అయితే దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోగా.. ఆ స్థానంలో ఏఎం జ్యోతికృష్ణ ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా విజయవాడలోని ఒక పాత బంగ్లాలో షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. పవన్ కు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని.. బంగ్లానే స్టూడియోగా మార్చి చిత్రీకరణ మొదలుపెట్టారు.

అంతకు వరకు బాగానే ఉన్నా.. హరి హర వీరమల్లు షూటింగ్ కు మళ్లీ బ్రేకులు పడ్డాయని టాక్ వినిపిస్తోంది. మూడు రోజులు మాత్రమే పవన్ షూట్ లో పాల్గొన్నారని తెలుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన.. తన విధులకు సంబంధించిన పనులతో కూడా బిజీగా ఉండడం వల్ల సెట్స్ కు రావడం లేదని సమాచారం. అయితే పవన్.. నేడు తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తన దీక్షను విరమించారు.

అయితే విజయవాడ చేరుకున్నాక.. షూటింగ్ లో మళ్లీ పవన్ పాల్గొంటారని కొందరు అంటున్నారు. చిన్న బ్రేక్ మాత్రమేనని చెబుతున్నారు. మొఘలుల కాలం నాటి బ్యాక్‍ డ్రాప్‍ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్‌ 2025 మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్.. కీలక పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‍ గా నటిస్తున్నారు. విక్రమ్‍ జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, జిస్సు సెంగుప్త కీరోల్స్ చేస్తున్నారు.

అయితే దీపావళి కానుకగా మూవీ నుంచి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అదిరిపోయే సాంగ్ ను రెడీ చేస్తున్నారని టాక్ వస్తోంది. త్వరలోనే పాట రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. మరి చూడాలి ఇందులో నిజమెంతో.