నాలుగు రోజులు కాదు పీకే ఇవ్వాల్సింది 12 రోజులా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `హరిహర వీరమల్లు` మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 April 2025 5:01 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `హరిహర వీరమల్లు` మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టు మీద ఉన్నారు. కానీ అది సాధ్యమ వుతుందా? లేదా? అన్నది రిలీజ్ వరకూ గానీ చెప్పలేని పరిస్థితే. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలా సార్లు వాయిదా వేసారు. రిలీజ్ చేస్తున్నామని చెబుతూనే వాయిదా వేస్తూ వచ్చారు.
చివరికీ ఆ సినిమా రిలీజ్ సన్నివేశం ఎలా తాయరైంది? అంటే ప్రజల్ని రాజకీయా నాయకులు మభ్య పెట్టినట్లే కనిపించింది. ఎన్నికలకు ముందు ఒక మాట...ఎన్నికలైన తర్వాత మరో మాటలాగే వీరమల్లు రిలీజ్ విషయంలో సన్నివేశం కనిపిస్తుంది. తాజాగా ఈ కథనాన్ని బలపరుస్తూ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి లీకైంది. ఈ సినిమా కోసం పవన్ ఇవ్వాల్సింది నాలుగు రోజులు కాదు 12 రోజులు అని కొత్త వార్త తెరపైకి వచ్చింది.
ఇప్పటి వరకూ పీకే నాలుగు రోజులు సెట్స్ కి హాజరైతే పెండింగ్ పోర్షన్ పూర్తవుతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా నాలుగు రోజులు కాస్త 12 రోజులుగా మారడం అన్నది అభిమానులకు షాకింగ్ అనే చెప్పాలి. ఇదే నిజమైతే రిలీజ్ విషయంలో ఆశలు మళ్లీ నీరు గారిపోవడం లాంఛనమే. నాలుగు రోజులికే అంత హంగామా నడిచిన నేపథ్యంలో 12 రోజులంటే రిలీజ్ ఇప్పట్లో జరిగేదేనా? అన్న సందేహాలు తప్పవు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.
ఒకవేళ నిజమే అయితే పవన్ 12 రోజులిస్తే ఆ చిత్రీకరణ అంతా మూడు వారాల పాటు షూట్ చేయాల్సి ఉంటుందిట. హెచ్చు తగ్గులుంటాయి కాబట్టి ఇంత సమయం అనివార్యమైందే. ఇలా జరగాలన్నా పవన్ ఉన్న పళంగా డేట్లు కేటాయించాలి. మధ్యలో మళ్లీ ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా హాజరవ్వాలి. మేకర్స్ కూడా అంతే నిర్విరామంగా పని చేయాలి. ఏకకాలంలో పూర్తయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరగాలి. మరి సంవత్సరాలుగా జరగనిది ఇప్పటికిప్పుడు సాద్యమేనా అంటే? సంగతి పెరుమాళ్లకే తెలియాలి.