Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు.. ఈ బాక్సాఫీస్ టార్గెట్ సాధ్యమేనా?

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా ఐదేళ్లుగా నిర్మాణ దశలో ఉంది.

By:  Tupaki Desk   |   7 March 2025 4:00 AM IST
హరిహర వీరమల్లు.. ఈ బాక్సాఫీస్ టార్గెట్ సాధ్యమేనా?
X

టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాకు రత్నం కుమారుడు జ్యోతిక్రిష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా ఐదేళ్లుగా నిర్మాణ దశలో ఉంది. ఈ కాలంలో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని, నిర్మాత ఏఎమ్ రత్నం పెట్టిన పెట్టుబడులను రికవర్ చేసుకోవాలంటే ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాను మార్చి 28న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉండడం వల్ల ఆ సమయానికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇక సినిమా నిర్మాతలకు లాభాలు రావాలంటే ఈ మూవీ కనీసం 350 కోట్ల గ్రాస్‌ను సాధించాలి. అయితే ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్న అభిమానులనే కాదు, సినీ వర్గాలను కూడా వెంటాడుతోంది. పవన్ కళ్యాణ్ గత రెండు సినిమాలు వకీల్ సాబ్ (2021), భీమ్లా నాయక్ (2022) ఏది కూడా కనీసం 170 కోట్లు దాటలేదు.

అయితే ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రన్‌ను చూస్తే 350 కోట్ల లక్ష్యానికి ఇంకా దూరంగా ఉన్నట్టే. కానీ హరిహర వీరమల్లు మాత్రం పూర్తిగా వేరే జానర్ కావడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ తాజా పొలిటికల్ స్టెప్పులే. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన పవన్, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే బజ్‌ను సినిమా ప్రోమోషన్స్‌కు మలచుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

హరిహర వీరమల్లు మొదటి వారం ఓపెనింగ్స్ బాగానే ఉండొచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి వారం 80-120 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. అయితే సక్సెస్ అయ్యేందుకు కేవలం ఓపెనింగ్స్ సరిపోవు. స్ట్రాంగ్ కంటెంట్ ప్రమోషన్, మంచి రివ్యూలు ఉండాలి. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేయాలంటే సినిమా విజువల్ గ్రాండియర్, ట్రైలర్ రెస్పాన్స్, మ్యూజిక్ అన్నీ హై స్టాండర్డ్‌లో ఉండాలి.

ఈ చిత్రం తొలి భాగం హిట్ అయితేనే రెండో పార్ట్‌కు అవకాశం ఉంటుంది. మరోవైపు సినిమాటిక్ లెవెల్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నా, ప్రేక్షకుల నుంచి అందుకు మద్దతు లభించాలంటే పవర్‌ఫుల్ కథ ఉండాల్సిందే. సినిమా బడ్జెట్ భారీగా పెరిగిన దృష్ట్యా, సినిమా విజయవంతమైతేనే లాభాలు వస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్‌కు అసలు సమయం ఇవ్వరనేది అందరికి తెలిసిందే. రాజకీయంగా పవన్ ప్రజల్లో పాపులర్ అయినా, అదే హవా బాక్సాఫీస్ వసూళ్లలో చూపించగలరా? హిందీ మార్కెట్‌లో ఈ సినిమా ఏ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.