పవన్ అదనంగా మరో 4 కోట్లు విరాళం!
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రియల్ హీరో అనిపించారు.
By: Tupaki Desk | 4 Sep 2024 11:24 AM GMTఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రియల్ హీరో అనిపించారు. వరద బాధితులను ఆదుకునేందుకు భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి కోటి చొప్పున రెండు కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ పై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రేమని చాటుకున్నారు.
ఆయన పంచాయతీరాజ్ శాఖకు కూడా మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పున మొత్తం 4 కోట్లు ప్రత్యేకంగా విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వరద బాధితుల కోసం మొత్తంగా ఆయన అందించిన విరాళం 6 కోట్లు అని తెలు స్తోంది. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెండి తెరపైనే కాదు..వెండి తెర వెనుక రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంత మంది అసలైన రియల్ బాహుబలి అంటూ పొగిడేస్తున్నారు. అయితే తెలంగాణ పంచాయతీలకు కూడా పవన్ సహాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు అక్కడ కూడా భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. నైజాంలో పవన్ కి వీరాభిమానులెంతో మంది.
నితిన్ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీలో ఎదగాడంటే పవన్ కళ్యాణ్ కూడా పరోక్ష కారుకుడిగా గతంలో హైలైట్ అయింది. అంత ఫ్యాన్ బేస్ ఉన్నా? తెలంగాణపైనా కరుణ చూపరా? అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రాంతం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.