డబ్బు అవసరం ఉన్నంత వరకూ పీకే సినిమాలు!
ఆ రెండు సినిమాల షూటింగ్ లు ప్రారంభమై సవంత్సరాలు గడుస్తున్నా? ఇంత వరకూ వాటి చిత్రీకరణ పూర్తి కాలేదు
By: Tupaki Desk | 24 March 2025 12:20 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా..పదవి పరంగా ఆయన బిజీ షెడ్యూల్ చూసి సినిమాలకు రిటై ర్మెంట్ ఇచ్చేయడం ఖాయమంటూ ఇటీవల మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సెట్స్ లో ఉన్న `ఓజీ`, `హరిహరవీరమల్లు` రిలీజ్ తర్వాత పవన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్త లొచ్చాయి. ఆ రెండు సినిమాల షూటింగ్ లు ప్రారంభమై సవంత్సరాలు గడుస్తున్నా? ఇంత వరకూ వాటి చిత్రీకరణ పూర్తి కాలేదు.
దీంతో పవన్ తీరుతో ఆయా దర్శక, నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇక పవన్ తనయుడు అకీరా నందన్ ని హీరోగా లాంచ్ చేస్తాడని...`ఉస్తాద్ భగత్ సింగ్` సినిమాతోనే ఆపని పూర్తి చేస్తాడని కూడా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ సినీ కెరీర్ కి సంబంధించి ఓ ఇవిషయం రివీల్ చేసారు.
తనకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానన్నారు. అది మాత్రం తనకు తప్పదన్నారు. అలాగని పరిపాలనా, రాజకీయ పరంగా ఎక్కడా రాజీ పడకుండానే పని చేస్తానన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నానని వెండి తెరకు దూరమవుతానన్నది అసత్య ప్రచారంగా ఖడించారు. రెండు వేర్వేరు రంగాలైనా? తనకు రెండు రంగాలు అవసరమేననన్నారు.
దీంతో పవన్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కొనసాగుతారని తేలిపోయింది. ఆయన రిటైర్మెంట్ పై వస్తోన్న కథనాలన్నీ అవాస్తవమని తెలుస్తోంది. అయితే పవన్ ఇప్పటికప్పుడు `హరిహర వీరమల్లు` సినిమాకు నాలుగు రోజులు డేట్లు ఇవ్వాల్సి వుంది. ఆ నాలుగు రోజులు డేట్లు ఎప్పుడు ఇస్తారా? అని వీరమల్లు మేకర్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.