Begin typing your search above and press return to search.

నీలో ఇదే ఫైర్ కంటున్యూ అవ్వాలి బాబాయ్!

నేడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అర్ద‌రాత్రి నుంచే సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభా కాంక్ష‌లు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Sep 2024 12:07 PM GMT
నీలో ఇదే ఫైర్ కంటున్యూ అవ్వాలి బాబాయ్!
X

నేడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అర్ద‌రాత్రి నుంచే సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభా కాంక్ష‌లు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే. మెగాప్రేక్ష‌కాభిమానులంతా అభిమాన హీరోకి ప్ర‌త్యేకంగా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇండ‌స్ట్రీ స‌హా రాజ‌కీయాల వ‌ర‌కూ అంతా నేటి సోషల్ మీడియా అంత‌టా ప‌వ‌న్ మ‌యం అయింది. ఇక మెగాఫ్యామిలీ హీరోలంతా ప‌వ‌న్ కి ప్ర‌త్యేకంగా విషెస్ తెలియ‌జేసారు.

చిరంజీవి నుంచి బంధువ‌ర్గం అంతా త‌మ‌దైన శైలిలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఓ పాత ఫోటోని షేర్ చేసి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపాడు. ఆ ఫోటోను ప‌రిశీలిస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోఫాలా కూర్చుని కింద కుర్చున్న వ‌రుణ్ తేజ్ తోడ‌ల మీద‌ పీకే కాళ్లు పెట్టాడు. వాటిని ఎంతో శ్ర‌ద్ద‌గా వ‌రుణ్ తేజ్ ప‌డుతున్నాడు. దీంతో వ‌రుణ్ తేజ్ బాబాలా మారిపోయి వ‌రుణ్ తేజ్ ని దీవిస్తున్నాడు.

పీకేతో పాటు ఆ ప‌క్క‌నే మ‌రో బాలుడు పీకే చేతులు ప‌ట్ట‌డం గ‌మ‌నించొచ్చు. ఈ పిక్ షేర్ చేస్తూ వ‌రుణ్ ఇలా రాసుకొచ్చాడు. `హ్యాపీ బర్త్ డే బాబాయ్.. నిన్ను చూస్తూనే మేము పెరిగాము. నువ్వు ఎంచుకున్న మార్గం, వేరే వాళ్లకు సహాయం చేసే విధానం మాకు స్ఫూర్తినిచ్చింది. ఇదే ఫైర్ నీలో కంటిన్యూ అవ్వాలి. నువ్వు మరింత ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. నా పవర్ తుఫానుకు లవ్ యు` అంటూ రాసుకొచ్చాడు.ఈ పోస్ట్ నెట్టింట‌ వైరల్ గా మారింది.

ఈ పిక్ చూడ‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త సినిమాల్లో పోషించిన హాస్య బాబా గుర్తొస్తున్నాడు. గుడుంబా శంక‌ర్ సినిమాలో బ్ర‌హ్మానందాన్ని ఇరికించే స‌న్నివేశంలో కాషాయం ధ‌రించి బాబా గెట‌ప్ వేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాయి. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రియ‌ల్ లైఫ్ లో ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఉంటాడు. త‌రుచూ స్వామి మాల‌లు ధ‌రిస్తుంటాడు.