బాబాయ్- అబ్బాయ్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2024 6:45 AM GMTబాబాయ్.. అబ్బాయ్.. అదేనండీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చరణ్ ను పవన్ బాగా చూసుకుంటారు! మెగాస్టార్ చిరంజీవి తన మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల.. చరణ్ ఎక్కువగా పవన్ దగ్గరే పెరిగారు. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సార్లు చెప్పారు.
చరణ్ కూడా బాబాయ్ పై ఉన్న తన ఇష్టాన్ని అనేక సార్లు వివిధ సందర్భాల్లో బహిరంగంగా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు బాబాయ్.. అబ్బాయ్ కోసం సందడి చేయనున్నారు. రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రేపు (డిసెంబర్ 20) అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ అక్కడికి బయలుదేరారు.
పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. అయితే రీసెంట్ గా లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్.. చెన్నైలో త్వరలో సందడి చేయనున్నారు. జనవరి మొదటి వారంలో తెలుగు స్టేట్స్ లో ఓ ఈవెంట్ ను నిర్వహిస్తామని ఇప్పటికే గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు తెలిపారు.
ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 4వ తేదీన ఆ వేడుక గ్రాండ్ గా జరగనున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారగా.. బాబాయ్ అబ్బాయ్ మూమెంట్ కోసం వెయిటింగ్ అంటున్నారు నెటిజన్లు.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. చరణ్ డ్యూయల్ రోల్ పోషించారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ గా కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్ జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మరి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్న గేమ్ ఛేంజర్ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.