టాలీవుడ్ లో బ్రదర్స్ కలవాల్సిన సమయం ఇదేనా!
మెగాస్టార్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ లకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
By: Tupaki Desk | 4 Nov 2024 10:30 AM GMTతెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతు న్నాయంటే? బజ్ పీక్స్ లో జరుగుతుంది. అందులోనూ పాన్ ఇండియా కంటెంట్ అంటే? ఆ బజ్ సాధారణ లెవల్ కూడా దాటిపోతుంది. ఆ రేంజ్ లో తెలుగు సినిమాకి పాన్ ఇండియాలో క్రేజ్ ఉంది. మరి అలాంటి తెలుగు సినిమా బ్రదర్స్ కలిసి పనిచేయడానికి ఇదే సరైన సమయమా? అంటే అవుననే అనాలి.
మెగాస్టార్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ లకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ వాళ్లిద్దరు కలిసి ఇంతవరకూ తెలుగులోనే సినిమా చేయలేదు. ఆ కాంబినే షన్ ని వెండి తెరపై చూడాలన్నది కోట్లాది మంది ఆశ. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నార్త్ లో అతడి డిమాండ్ కూడా పెరిగింది. ప్రజా బలం ఉన్న నాయకుడిగా ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో చిరుతో కలిసి సినిమా చేస్తే అది వందల కోట్ల వసూళ్లకు అవకాశం ఉంది.
వాళ్లిద్దర్నీ పక్కన బెడితే బన్నీ ఇప్పటికే పాన్ ఇండియాలో ఫేమస్. అతడు కూడా తమ్ముడు శిరీష్ తో కలిసి ఓ సినిమా చేసి పాన్ ఇండియాలో రిలీజ్ చేయోచ్చు. అతడి క్రేజ్ తో పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ్ముడు ఇంకా ఫేమస్ అవుతాడు. ఇక మెగా బ్రదర్స్ లో రామ్ చరణ్ ఇప్పటికే గ్లోబల్ స్టార్. అతడు వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. వరుణ్ కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయస్తుడే.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో ఇప్పటికే ఓ సంచలనం. `ఆర్ ఆర్ ఆర్`, `దేవర`తో రికార్డులే క్రియేట్ చేసారు. ఈ నేపథ్యంలో తారక్ ఎంతగానో ప్రేమించే అన్నయ్య కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తే అద్భుతమే కదా. వెండి తె రపై అన్నదమ్ముల్ని చూసుకేనే అవకాశం అభిమానులకు కలుగుతుంది. ఇంకా ఇలాంటి కాంబి నేషన్లు కొన్ని ఉన్నాయి. అక్కినేని నాగచైతన్య-అఖిల్, వైష్ణవ్ తేజ్-సాయి దుర్గ తేజ్, దేవరకొండ బ్రదర్స్ ఒకే ప్రేమ్ లో కనిపించాలని అభిమానులు ఆశపడుతున్నారు. అలాగే కోలీవుడ్ నుంచి సక్సస్ పుల్ హీరోలు సూర్య-కార్తీలను కూడా ఒకే తెరపై చూడాలన్నది అభిమానుల ఆశ.