Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ రెబల్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ ఉదాహరణ..!

యూత్ ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ కి ఒక స్పెషల్ క్రేజ్ ని కొలవడం అసాధ్యం అనిపించేలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 10:09 AM GMT
పవన్ కళ్యాణ్ రెబల్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ ఉదాహరణ..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ స్టార్స్ అందరిలో పవర్ స్టార్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనేట్టుగా ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. యూత్ ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ కి ఒక స్పెషల్ క్రేజ్ ని కొలవడం అసాధ్యం అనిపించేలా ఉంటుంది. ఐతే కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ ని ఆయన లోని హీరోయిజాన్ని స్పూర్తిగా పొందిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలోనే కేరళకు చెందిన ఒక మార్కిస్ట్ గ్రూప్ మెంబర్ పోరాలి షాజి.

పవన్ కళ్యాణ్ లోని రియల్ రెబల్ ఇమేజ్ ని బాగా అబ్సర్వ్ చేసిన అతను తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పవన్ కళ్యాణ్ ఫోటోని పెట్టుకున్నాడు. ఇప్పుడు కాదు దాదాపు 7 ఏళ్లుగా అతని ప్రొఫైల్ ఫోటో అదే ఉంది. పవన్ కళ్యాణ్ లోని రెబలిజం ని అతను కనిపెట్టాడని విశ్లేషకులు చెబుతున్నారు. కేరళలో ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. మోహన్ లాల్, మమ్ముట్టితో పాటు ఇప్పటితరం స్టార్స్ చాలామంది ఉన్నారు.

కానీ వాళ్లందరినీ కాదని ఫారోలి షాజి పవన్ ఫోటోనే పెట్టుకోవడానికి కారణం అతనిలోని రెబలిజం అని చెబుతున్నారు. అందుకే ఆ పేజ్ కి లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడుతున్నారని. ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ లో ఆ పేజ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని అంటున్నారు. కేరళలో ఒక పేజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ ప్రాంతాలు, భాషతో సంబంధం లేకుండా పాకిపోతుంది. ఆల్రెడీ పవన్ సినిమాలతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. ఏపీ లో రాజకీయ ప్రక్షాలనకు తన వంతు బాధ్యతగా ముందుకు వెళ్తున్నాడు. ఐతే పొలిటికల్ గా బిజీ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త అనుకున్నంత టైం ఇవ్వలేకపోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ తెలుసు కాబట్టే ఈసారి ఆయనతో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారు మేకర్స్. సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా వస్తుండగా జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా రాబోతుంది.