శత్రుసైన్యంపై వీరమల్లు వ్యూహం!
వీరమల్లు బ్యాక్ ఫోజ్ ఇది. శత్రు సైన్యంపై దాడికి వ్యూహం పన్నుతోన్న వీరుడు లుక్ ఇది. లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
By: Tupaki Desk | 30 Nov 2024 10:32 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరలమల్లు' షూటింగ్ మరో నాలుగైదు రోజులు చేస్తే పవన్ పోర్షన్ పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఎప్పటి నుంచి డేట్లు ఇస్తాడు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన నేటి నుంచే షూటింగ్ షురూ చేసారు. ఈ చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్ నేటి నుంచి మొదలైనట్లు తెలిపారు. ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం మొదలైంది.
ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారని క్యాప్షన్‌తో ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని నుంచుని ఉన్న ఫోటోను విడుదల చేసారు. పవన్ ఆహార్యం మరోసారి అభిమానుల్ని ఫిదా చేస్తుంది. రాజుల కాలం నాటి దుస్తులు...చెప్పులు ధరించారు. మెడలో ఎర్రటి తుండు..మొలలో వీరుడి కత్తి బెల్టు చూడొచ్చు. చేతికి కడియం...అదే చేతిలో పదునైన వీరుడు కత్తిని...తీక్షణమైన చూపు ఆకట్టుకుంటుంది.
వీరమల్లు బ్యాక్ ఫోజ్ ఇది. శత్రు సైన్యంపై దాడికి వ్యూహం పన్నుతోన్న వీరుడు లుక్ ఇది. లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం పవన్ పొడవైన జుట్టు పెంచుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్..టీజర్ లోనే ఆ సంగతి అర్దమైంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ అభిమానుల్ని ఈలుక్ ఆకట్టుకుంటుంది.
పవన్ మరో నాలుగు రోజుల పాటు షూటింగ్ కి హాజరైతే ఆయన పార్టు పూర్తవుతుంది. అటుపై బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమాని డైరెక్ట్ చేసింది క్రిష్. మధ్యలో ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఎంటర్ అయ్యారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.