వీరమల్లు బల్లగుద్దినా అభిమానులు నమ్మడం లేదా!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న `హరిహర వీరమల్లు` మార్చి 28న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Feb 2025 9:30 AM GMTపవన్ కళ్యాణ్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న `హరిహర వీరమల్లు` మార్చి 28న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్కటిగా లిరికల్ సింగిల్స్ రిలీజ్ అవుతున్నాయి. మార్చి 28 అంటే రిలీజ్ కి ఇంకా సరిగ్గా నెల రోజుల సమయం ఉన్నట్లు. ఈలోపు చిత్రీకరణ సహా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తవ్వాలి. చేతికి తొలి కాపీ రావాలి.
సెన్సార్ పూర్తవ్వాలి. ఇలా ఇంత తతంగం ఉంది. కానీ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు డేట్లు ఇస్తే తప్ప షూటింగ్ పూర్తి కాదు. ఆ నాలుగు రోజులు పవన్ ఎప్పుడు ఇస్తాడా? అని మేకర్స్ మూడు నెలలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ అది సాధ్యపడలేదు. `ఓజీ` షూటింగ్ లో పాల్గొనడం... మిగతా సమయాన్ని రాజకీయాలకు కేటాయించడంతోనే పవన్ కి సరిపోతుంది. ఆ నాలుగు రోజులు పవన్ ఎప్పుడు ఇస్తాడు? అన్నది తెలియదు.
కానీ మార్చి 28న మాత్రం రిలీజ్ అవుతుందని యూనిట్ బల్లగుద్ది మరీ చెబుతుంది. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు మాత్రం అభిమానుల్లో అంతే బలంగా ఉన్నాయి. ఇది జరగదు అని కొంత మంది అభిమానులు అంతే కాన్పిడెంట్ గానూ ఉన్నారు. అందుకు కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు. మార్చి 28న వీరమల్లు రిలీజ్ అయితే నితిన్ `రాబిన్ హుడ్` ఎందుకు రిలీజ్ అవుతుంది? అలాగే నాగవంశీ తన `మ్యాడ్ స్క్వేర్` ని ఎందుకు రిలీజ్ చేస్తాడు?
నితిన్, నాగవంశీ పవన్ కి అభిమానులు. విధేయులుగా ఉంటారు. పవన్ కి పోటీగా నితిన్ సినిమా రిలీజ్ చేయడు. పవన్ సినిమా రిలీజ్ అయితే నా సినిమా ఎలా రిలీజ్ చేస్తానని నాగవంశీ అంటాడు. ఇవే సందేహాలు అభిమానులు రెయిజ్ చేస్తూ వీరమల్లు రిలీజ్ కాదంటున్నారు. పక్కాగా వీరమల్లు రిలీజ్ అవుతుందనుకుంటే నితిన్..నాగవంశీలు తమ సినిమాల్ని ఇప్పటికే వాయిదా వేసుకునే వారు అని అంటున్నారు. మరి ఈప్రచారానికి పుల్ స్టాప్ పడాలంటే? మరికొన్ని రోజులు ఆగాల్సిందే.