Begin typing your search above and press return to search.

వీరమల్లు VS OG - ఎవరు తగ్గుతారో?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల సినిమా షూటింగ్స్ రీసెంట్ గా మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:56 AM GMT
వీరమల్లు VS OG - ఎవరు తగ్గుతారో?
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల సినిమా షూటింగ్స్ రీసెంట్ గా మొదలు పెట్టారు. ఓ వైపు మంత్రిగా పరిపాలనలో తలమునకలైన కూడా పవన్ కళ్యాణ్ కొంత సమయం ఈ సినిమాల కోసం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ ని విజయవాడలో ప్రత్యేకంగా గ్రీన్ మ్యాట్ సెట్ వేసి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశలో ఉంది. కొన్ని సీక్వెన్స్ మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో పాటుగా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసేసారు. వైజాగ్ లో ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మర్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో మూవీపైన అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

దీనికంటే ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ సుజిత్ ‘ఓజీ’ మూవీపైన ఉన్నాయి. ఈ సినిమాని 2025 ప్రథమార్ధంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో మంచి డేట్ కోసం చూస్తున్నారు. అంటే నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే రెండింటి మధ్య కనీసం 6 నెలలైనా గ్యాప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కానీ ఇటు ఏఎం రత్నం, అటు డివివి దానయ్య ఇద్దరు కూడా తగ్గేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రెండు సినిమాలు వేగంగా పూర్తి చేసి నెక్స్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైన ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు. వారికి కూడా షూటింగ్ ప్లాన్ చేసుకోమని ఇప్పటికే హింట్ ఇచ్చారంట. 2025లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాల రిలీజ్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ వార్ నడుస్తోంది. అయితే ఫైనల్ గా ఎవరో ఒకరు మాత్రం కచ్చితంగా వెనక్కి తగ్గాల్సి ఉంటుందని అనుకుంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది. సినిమా స్టార్ట్ చేసి 3 ఏళ్ళు అయిపొయింది. ఆలస్యం అవుతున్న కొద్ది బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నిర్మాత ఏఎం రత్నం ముందుగా రావాలని అనుకుంటున్నారు. అది సాధ్యం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.