Begin typing your search above and press return to search.

పవన్ షూటింగ్‌లకు హాజరవుతున్నాడా?

ఇటు హరిహర వీరమల్లు, అటు ఓజీ సినిమాల మేకర్స్ కొత్త షెడ్యూళ్ల కోసం కొన్ని రోజుల కిందటే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 12:10 PM GMT
పవన్ షూటింగ్‌లకు హాజరవుతున్నాడా?
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మళ్లీ ఎప్పుడు ‘పవర్ స్టార్’ అవుతాడా అని ఇటు నిర్మాతలు, అటు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది చివరి క్వార్టర్ నుంచి ఆయన రాజకీయాలకే అంకితం అయ్యారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం తర్వాత ఏర్పాటైన ప్రభుత్వంలో ఆయన కీలక పాత్రధారిగా మారారు. డిప్యూటీ హోం మినిస్టర్‌గా నియమితుడు కావడంతో పాటు నాలుగు ముఖ్య శాఖల బాధ్యతలనూ తీసుకున్నారు.

కొన్నాళ్లు ఈ బాధ్యతలు చూశాక వీలు చేసుకుని మధ్యలో ఆగిన సినిమాలను పూర్తి చేస్తానని పవన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన మూడు నెలల సమయం ముగిసింది. ఇటు హరిహర వీరమల్లు, అటు ఓజీ సినిమాల మేకర్స్ కొత్త షెడ్యూళ్ల కోసం కొన్ని రోజుల కిందటే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

కానీ పవన్ తిరిగి ఎప్పుడు షూటింగ్‌‌కు వస్తాడన్న విషయంలో క్లారిటీ లేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ఏ అప్‌డేట్ లేదు. ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ ఆల్రెడీ చిత్రీకరణలో పాల్గొంటున్నాడని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. పవన్ మళ్లీ ముఖానికి రంగేసుకోవడం గురించి ఎక్కువ చర్చ జరిగితే జనాలకు సరైన సంకేతాలు వెళ్లవనే ఉద్దేశంతో ఈ విషయాన్ని దాచి పెడుతున్నట్లుగా చెబుతున్నారు. పవన్ అధికారిక బాధ్యతలకు పూర్తిగా దూరం కాకుండా షూటింగ్ చేస్తున్నారని.. రోజులో కొన్ని గంటలు షూట్‌కు హాజరవుతున్నాడని చెబుతున్నారు.

పవన్ మళ్లీ షూటింగ్‌కు వస్తున్న విషయమై అప్‌డేట్స్ ఇవ్వొద్దని.. హడావుడి లేకుండా చిత్రీకరణ చేయాలని.. పవన్ టీం నుంచి నిర్మాతలకు సూచనలు వెళ్లాయని తెలుస్తోంది. పవన్ మార్చి మార్చి హరిహర వీరమల్లు, ఓజీ షూట్స్‌కు హాజరవుతాడని.. ఈ ఏడాది చివర్లోపు రెండు సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నాడని.. తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను పున:ప్రారంభిస్తాడని సమాచారం.