Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్.. అన్ని సినిమాలు అక్కడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 11:30 AM GMT
పవన్ కళ్యాణ్.. అన్ని సినిమాలు అక్కడే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ మూడేళ్ళ నుంచి సాగుతోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా ఆశించిన స్థాయిలో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుందని నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉంటున్నారు. అయితే పెండింగ్ ఉన్న సినిమాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తానని ఇప్పటికే ఆయా నిర్మాతలకి కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ కి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని క్లారిటీ ఇచ్చారంట.

ఈ నేపథ్యంలో హరిహరవీరమల్లు పెండింగ్ పార్ట్ అంతా జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి చేయడానికి ఏఎం రత్నం సిద్ధమయ్యారు. ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలు ఫినిష్ చేస్తున్నారంట. మరో వైపు అమరావతిలో ఈ మూవీ షూటింగ్ కోసం గ్రీట్ మ్యాట్ ఫ్లోర్ ని రెడీ చేసారంట. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేయడం కష్టం అని అమరావతిలోనే ఏర్పాట్లు చేసారంట.

ఇప్పటికే గ్రీట్ మ్యాట్ ఫ్లోర్ షూటింగ్ కోసం రెడీ అయిపోయిందనే మాట వినిపిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారంట. మరో వైపు ఓజీ మూవీ షూటింగ్ కోసం వైజాగ్ లో ఏర్పాట్లు చేస్తున్నారంట. త్వరలో ఓజీ మూవీ షూటింగ్ కూడా సుజిత్ స్టార్ట్ చేస్తారంట. పవన్ కళ్యాణ్ పరిపాలనా కార్యకలాపాలలో బిజీగా ఉండటంతో ఆయన సినిమా షూటింగ్స్ అన్ని ఏపీకి షిఫ్ట్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ ఇలా ఏపీకి షిఫ్ట్ అవ్వడంతో ఓ విధంగా ఆంధ్రాకి మంచిదనే మాట వినిపిస్తోంది. అక్కడి ప్రభుత్వానికి ఈ షూటింగ్స్ కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ చేస్తామని నిర్మాత తెలిపారు. ఉస్తాద్ మూవీ కోసం ఏపీలోనే సెట్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కడ అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా పవన్ లాంటి బిగ్ స్టార్ నటిస్తున్న సినిమా షూటింగ్స్ ఏపీ లో జరగడం చాలా మంచిది. మిగతా స్టార్స్ కూడా ఇదే తరహాలో ఆలోచిస్తే ఏపీ గ్రోత్ లో భాగం కావచ్చు.