Begin typing your search above and press return to search.

ట్రిమ్మింగ్ వీర‌మ‌ల్లు కోస‌మా? `ఓజీ` కోస‌మా?

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ గెడ్డం ట్రిమ్ చేసారు. అలాగే లుక్ ప‌రంగానూ కొన్ని మార్పులు క‌నిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 March 2025 11:22 AM IST
ట్రిమ్మింగ్ వీర‌మ‌ల్లు కోస‌మా? `ఓజీ` కోస‌మా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని రోజులుగా రాజకీయం, అసెంబ్లీ స‌మావేశాలంటూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సినిమా షూటింగ్ లు రెండింటికి పుల్ స్టాప్ పెట్టాల్సి వ‌చ్చింది. అయితే తాజాగా ప‌వ‌న్ న్యూ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఇంకా కాషాయం ధ‌రించే ఉన్నారు. మాలా ధార‌ణ‌లో భాగంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ గెడ్డం ట్రిమ్ చేసారు. అలాగే లుక్ ప‌రంగానూ కొన్ని మార్పులు క‌నిపిస్తున్నాయి.

మునుప‌టి కంటే స్లిమ్ లుక్ లో క‌నిపిస్తున్నారు. క‌ళ్ల‌లో తేజ‌స్సు ఉట్టిప‌డుతుంది. హెయిర్ మాత్రం య‌ధావిధి గానే ఉంది. హెయిర్ ప‌రంగా ఎలాంటి మార్పులు క‌నిపించ‌లేదు. మ‌రి ఈ న్యులుక్ దేనికోసం అంటే? తిరిగి మ‌ళ్లీ షూటింగ్ ల కోస‌మేన‌ని తెలుస్తోంది. అయితే ఈ లుక్ 'ఓజీ' కోస‌మా? 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' కోస‌మా? అన్న‌ది క‌న్ప‌మ్ అవ్వాలి. ఓజీలో ప‌వ‌న్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడు.

అలాగే వీర‌మ‌ల్లులో యోదుడి పాత్ర పోషిస్తున్నాడు. 'ఓజీ'లో గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌కి లైట్ గా గెడ్డం ఉంది. వీర‌మ‌ల్లులో మాత్రం కొన్ని లుక్స్ లో క్లీన్ షేవ్లో ..మ‌రికొన్నింటిలో లైట్ గా గెడ్డం క‌నిపిస్తుంది. మ‌రి ఇప్పుడు తాజా లుక్ రెండు సినిమాల కోస‌మా? లేక వీర‌మ‌ల్లు కోసం స్పెష‌ల్ గా ట్రిమ్ చేయించాడా? అన్న‌ది తేలాలి. ఎందుకంటే వీరమ‌ల్లు కోసం ప‌వ‌న్ నాలుగు రోజ‌లు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్త‌వుతుంది.

షూటింగ్ అంతా పూర్త‌యింది. కేవ‌లం ప‌వ‌న్ నాలుగు రోజులు ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఆ తేదీన రిలీజ్ అవుతుందా? ద‌గ్గ‌ర చేసి వాయిదా అంటూ ట్విస్ట్ ఇస్తారా? అన్న‌ది చూడాలి.