Begin typing your search above and press return to search.

అంటే.. OG వచ్చేది ఎప్పుడు మరి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక హీరోగా సిల్వర్ స్క్రీన్ పైన కూడా చూడాలని అనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   17 Oct 2024 3:57 AM GMT
అంటే.. OG వచ్చేది ఎప్పుడు మరి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక హీరోగా సిల్వర్ స్క్రీన్ పైన కూడా చూడాలని అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి దేశ వ్యాప్తంగా ఇమేజ్ పెరిగింది. ఆయన గురించి ప్రస్తుతం నార్త్ ఇండియాలో కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పైన నడుస్తున్నది రాజకీయ చర్చ అయిన కూడా అది ఆయన నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమాలకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీస్ ఉన్నాయి. ఈ మూడు కూడా షూటింగ్ స్టేజ్ లోనే ఉండటం విశేషం. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. వారంలో రెండు, మూడు రోజులు షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిజానికి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ మూవీ 2025 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఎందుకనో దానికంటే ముందుగా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ‘ఓజీ’ మూవీ షూటింగ్ కూడా వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుందనేది క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ చేస్తోన్న మూడు సినిమాలలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఓజీ ఉంది.

ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఓజీ’ సినిమా బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో వరుస సినిమాలు రిలీజ్ ఉన్నాయి. తరువాత ఆగష్టు లో ప్రైమ్ డే అయిన 15న ‘వార్ 2’ రిలీజ్ కానుంది. మరల ఫెస్టివల్ వీకెండ్ కలిసి రావాలంటే దసరా వరకు వెయిట్ చేయాల్సిందే.

‘ఓజీ’ మూవీని 2025 దసరాకి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. అంటే ఏడాది పాటు ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. 2025 సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కి కూడా హరీష్ శంకర్ ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా 75% షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ చూసుకుంటే ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది అయిన సమయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మూడు సినిమాలు రిలీజ్ మధ్యలో ఒక్కోదానికి ఆరు నెలల గ్యాప్ అయిన ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.