OG టీజర్.. మళ్లీ షాక్ ఇచ్చారా..?
ఐతే సంక్రాంతికి ఓజీ టీజర్ వస్తుందని చెప్పుకొచ్చారు. సంక్రాంతి సినిమాలతో పాటు ఓజీ టీజర్ కూడా యాడ్ చేస్తున్నారని అన్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 6:59 AM GMTపవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో షాక్ తగిలింది. సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ఇంటర్వల్ టైం లో OG టీజర్ ని వేస్తారని హడావిడి చేశారు. ఐతే నేడు గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాగా అందులో పవర్ స్టార్ OG కాకుండా చందు మొండేటి డైరెక్షన్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమా బుజ్జి తల్లి వీడియో సాంగ్ వేశారు.
ఓజీ టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి మళ్లీ షాక్ తగిలినట్టు అయ్యింది. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమా మొదలై రెండేళ్లు అవుతున్నా ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు సరికదా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. ఐతే సంక్రాంతికి ఓజీ టీజర్ వస్తుందని చెప్పుకొచ్చారు. సంక్రాంతి సినిమాలతో పాటు ఓజీ టీజర్ కూడా యాడ్ చేస్తున్నారని అన్నారు.
తీరా గేమ్ ఛేంజర్ సినిమాలో ఇంటర్వల్ లో తండేల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. OG విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కూడా మేకర్స్ మాత్రం వారిని పట్టించుకోవట్లేదు. గేమ్ ఛేంజర్ కి ఇవ్వలేదు సరే 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలతో అయినా ఓజీ టీజర్ వదులుతారా లేదా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓజీ సినిమా తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరి హర వీరమల్లు సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉంది. మర్చి లో వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఓజీ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ ఇయర్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇవ్వనున్నాడు పవన్ కళ్యాణ్. ఐతే వీరమల్లు కన్నా OG మీదే ఫ్యాన్స్ గురి ఎక్కువ ఉంది.