Begin typing your search above and press return to search.

పవర్‌స్టార్ మాస్ ఎంట్రీకి రౌండప్ రెడీ!

గతంలో వచ్చిన లుక్, టీజర్ చూసిన వారందరూ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 6:30 PM GMT
పవర్‌స్టార్ మాస్ ఎంట్రీకి రౌండప్ రెడీ!
X

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ OG గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్‌ కెరీర్‌లో మరో వేరియేషన్ చూపించబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ మూడ్‌లో కనిపించబోతున్న సినిమా ఇదే. గతంలో వచ్చిన లుక్, టీజర్ చూసిన వారందరూ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే షూటింగ్ దాదాపు 60% పూర్తయింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో, మిగిలిన పార్ట్‌ను ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. కానీ టీమ్ మాత్రం పూర్తి కసరత్తుతో మిగిలిన షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. పవన్ కెరీర్‌లో అటువంటి మాస్ అప్పీల్ ఉండే సినిమాలు తక్కువే. కానీ OG మాత్రం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని చిత్ర యూనిట్ మాటల్లోనే స్పష్టమైంది.

సుజిత్ స్టైల్ టేకింగ్, రవి కె. చంద్రన్ విజువల్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసొచ్చేలా ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండబోతోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఓ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన పవర్‌పుల్ డైలాగులు, అండర్‌వర్ల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోట్ చేయించబోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ సినిమా గురించి చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో OG నుంచి మేజర్ అప్డేట్ రాబోతోందని మేకర్స్ నుంచి సమాచారం. ఇది టీజర్ అవుతుందా, స్పెషల్ వీడియో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మాసివ్ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వీరమల్లు పని ముగిసిన వెంటనే, తిరిగి OG మిగిలిన షూట్‌లో జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. ఈ సినిమా 2025 చివరలో విడుదలకు సిద్ధమవుతుందని టాక్ ఉంది. అయితే అధికారికంగా ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. మరి పవర్‌స్టార్ బాక్సాఫీస్‌పై మరోసారి సునామీ తీసుకురాబోతున్నారా? అన్నది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి They Call Him OG అప్‌డేట్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఫిబ్రవరి, మార్చి వరకూ వేచిచూడాల్సిందే. కానీ ఒక్కసారి ప్రొమోషన్లు మొదలైతే సినిమా మాస్‌లో ఎంతటి రచ్చ చేయబోతుందో ఊహించుకోవచ్చు.