Begin typing your search above and press return to search.

లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టైల్ చాలా ఇష్టం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తాజాగా మీడియాతో మాట్లాడిన‌ పవన్ కళ్యాణ్ త‌న‌కు త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా మేకింగ్‌పై ఉన్న ఆస‌క్తిని వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:54 AM GMT
లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టైల్ చాలా ఇష్టం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
X

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన దీర్ఘకాల ప్రాజెక్ట్ `హరి హర వీర మల్లు` పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను పునఃప్రారంభించారు. ప్ర‌ధాన‌మైన షూట్ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ పోర్షన్స్‌ని తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల కానుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన‌ పవన్ కళ్యాణ్ త‌న‌కు త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా మేకింగ్‌పై ఉన్న ఆస‌క్తిని వెల్ల‌డించారు. ప‌వ‌న్ మాట్లాడుతూ.. ``లోకేశ్ కనగరాజ్ మేకింగ్ శైలి నాకు చాలా ఇష్టం. నేను అతడి సినిమా లియో చూశాను`` అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లోకేష్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుడు. క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ స్టార్ల‌ను డైరెక్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్ ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడి గురించి, అతడి చిత్రాల గురించి మాట్లాడటం ఆక‌ర్షిస్తోంది. ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో పవన్ కళ్యాణ్ తాను న‌టుడు యోగి బాబు న‌ట‌న‌ను ఆరాధిస్తానని, సోష‌ల్ డ్రామాల్లో అత‌డు అద్భుతంగా న‌టిస్తాడ‌ని ప్రశంసించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఓ వైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నా కానీ, ప‌వ‌న్ త‌న సినిమా క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న‌ OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ విడుద‌ల కావాల్సి ఉంది. హరి హర వీర మల్లు కోసం లో తన పోర్షన్స్ పూర్తి చేసిన తర్వాత, పవన్ సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమాని ప్రారంభించనున్నాడు. ఓజీ మెజారిటీ షూట్ పూర్త‌యింది. పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.