Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:48 AM GMT
పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ మూడు సినిమాలు స్టార్ట్ చేయడంతో అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేయబోయే రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. వీటిలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా పునఃప్రారంభమైంది. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

పీరియాడికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తే, సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా మూవీ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందనేది క్లారిటీ లేదు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ మొదలైంది అనే వార్త ఫ్యాన్స్‌కి కాస్త సంతోషాన్ని అందించింది.

ఇదిలా ఉంటే, ఈ సినిమాపై మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. హరిహర వీరమల్లుకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఒక అదిరిపోయే ఫోక్ సాంగ్ రెడీ చేసారట. ఈ పాటను పవన్ కళ్యాణ్‌తో పాడిస్తే బాగుంటుందని కీరవాణి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఆల్ మోస్ట్ ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఆయన సాంగ్ పాడి చాలా కాలం అవుతోంది, కాబట్టి ఫ్యాన్స్ ఆయన గొంతు మళ్లీ వినాలని ఆశపడుతున్నారు. ‘హరిహర వీరమల్లు’లో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నారని వినిపిస్తున్న న్యూస్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కాబట్టి ఈ పాట చాలా స్పెషల్‌గా ఉండే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

డిప్యూటీ సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తోంది, ఇది సినిమా పై క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ క్రేజ్, హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ రైట్స్‌కి డిమాండ్ పెంచే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.