Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కోసం టార్గెట్ సెట్ చేసిన పవన్

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 1:30 PM GMT
ఆ డైరెక్టర్ కోసం టార్గెట్ సెట్ చేసిన పవన్
X

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం కొంత కాలంగా పాలిటిక్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఆయన సినిమా అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ తన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్లేలా ప్లాన్ చేశారు. ఇలా ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూట్‌లో పాల్గొన్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతంలోనే మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన మరోసారి నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫలితంగా ఈ క్రేజీ ప్రాజెక్టు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. అలా వరుసగా మూడు షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. కానీ, అంతలోనే ఎన్నికలు రావడంతో పవన్ కల్యాణ్ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చేశారు. అప్పటి నుంచి అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

హిట్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ గురించి అస్సలు ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను అతి త్వరలోనే మొదలు పెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. ఇందుకోసం ఇటీవలే దర్శకుడు హరీష్ శంకర్‌తో చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది.

హరీష్ శంకర్‌తో తాజాగా జరిపిన చర్చల్లో పవన్ కల్యాణ్ అతడికి డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిసింది. నవంబర్ చివరి వారం నాటికి ఈ సినిమాకు సంబంధించి డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్టును రెడీ చేయాలని టార్గెట్ పెట్టారట. అలా చేయగలిగితే వెంటనే బల్క్ డేట్స్ ఇచ్చి షూట్ రీస్టార్ట్ చేస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో హరీష్ శంకర్ తన టీమ్‌తో కలిసి బౌండెడ్ స్క్రిప్టును రెడీ చేస్తున్నట్లు టాక్. అంటే అంతా అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కూడా రీస్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.

ఇక, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ‘తేరీ’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా.. అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.