పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తెను చూసారా?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త 11 రోజుల దీక్ష ముగిసింది.
By: Tupaki Desk | 2 Oct 2024 5:57 AM GMTఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త 11 రోజుల దీక్ష ముగిసింది. దీక్షలో భాగంగా మంగళవారం సాయంత్రం మెట్ల ద్వారా కాలినడక కొంపడపైకి చేరుకున్న సంగతి తెలిసిందే. గోవిందనామస్మరణ చేస్తూ 3,550 మెట్లు ఎక్కారు. పవన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ డిక్లెరేషన్ పై సంతకం చేసి దర్శనం చేసుకుంటున్నారు. మరి అందుకు కారణం ఏంటి? అంటే
పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని అన్యమతస్తురాలు. మైనర్ బాలిక కావడంతో అధికారులు డిక్లరేషన్ కోరారు. దీంతో పలీనా తో పాటు పవన్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేసారు. టీటీడీ ఉద్యోగులు తీసుకు వచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసి ఆ ప్రక్రియ ముగించారు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ద కుమార్తె ఆద్య గురించి అందరికీ తెలిసిందే.
కానీ పలీనా గురించి చాలా మందికి తెలియదు. ఆమె పెద్దగా మీడియాలో ఇంతవరకూ కనిపించింది లేదు. అలా పలీనా అభిమానులుకు దూరంగా ఉంది. ఆద్య మాత్రం నిత్యం అన్నయ్య అకీరాతో ఎప్పటి కప్పుడు కనిపిస్తుంటుంది. దీంతో పలీనా అంజనా కొణిదెల పేరు ఆసక్తికరంగా మారింది. ఆమె ఫోటోలు నెట్టింట ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె అంటూ అభిమానులు సంతోష పడుతున్నారు.
ఇక ఆద్య పవన్ మాజీ రెండవ భార్య కుమార్తె కాగా, పలీనా అంజనా పవన్ కళ్యాణ్ మూడవ భార్య కుమార్తె. ఆమె తల్లి అన్నాలెజ్నివా అన్న సంగతి తెలిసిందే. అన్నా లెజ్నివా అన్య మతస్తురాలు కావడంతో తిరుమల డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. దీంతో వెంకటేశ్వర స్వామిపై తనకు విశ్వాసం వుందని తెలియ జేస్తూ పలీనా డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కుమార్తె మైనర్ కావడంతో తండ్రి పవన్ కల్యాణ్ కూడా సంతకం చేసారు.