Begin typing your search above and press return to search.

పెంచ‌ల్ దాస్ పాట‌ను ప‌వ‌న్ పాడాడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన ఈ పాట‌ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 10:30 PM GMT
పెంచ‌ల్ దాస్ పాట‌ను ప‌వ‌న్ పాడాడా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి కొన్ని రోజుల కింద‌ట మొద‌టి సాంగ్ రిలీజైన విష‌యం తెలిసిందే. మాట వినాలి పేరుతో సాగే ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన ఈ పాట‌ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ మాండ‌లిక ర‌చ‌యిత పెంచ‌ల్ దాస్ రాశాడు.

మాట వినాలి పాట‌కు పెంచ‌ల్ దాస్ రాసిన సాహిత్యం ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌చేసేదిలా ఉందని మంచి కాంప్లిమెంట్స్ కూడా వ‌చ్చాయి. పెంచ‌ల్ దాస్ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో జాన‌ప‌ద పాట‌ల‌ను రాశారు. నాని హీరోగా వ‌చ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు, జూ. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌లోని ఏడ పోయినాడో సాంగ్స్ తో ఆయ‌న బాగా పాపుల‌ర‌య్యాడు.

ఆయ‌న పాట పాడే విధానం, ఆయ‌న గొంతు లోని మ‌ట్టి వాస‌న ఆ జానప‌ద పాటల్ని ఇంకా స్పెష‌ల్ గా చేస్తాయని అంద‌రూ అంటుంటారు. అయితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులోని మాట వినాలి సాంగ్ ను వాస్త‌వానికి ఆయ‌నే పాడాల్సింద‌ట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల స‌డెన్ గా ట్రాక్ లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చాడ‌ట‌. ఈ విషయాన్ని స్వయంగా పెంచ‌ల్ దాసే వెల్ల‌డించాడు.

విశ్వ‌క్ సేన్ న‌టించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పెంచ‌ల్ దాస్ హాజ‌ర‌య్యారు. ఈ ఈవెంట్ లో భాగంగా యాంక‌ర్ సుమ‌, పెంచ‌ల్ దాస్ ను పాట పాడ‌మ‌ని కోర‌గా ఆయ‌న పాట‌ను పాడి త‌ర్వాత ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ పాట‌ను తాను పాడాల్సింద‌ని, కానీ త‌ర్వాత అనుకోకుండా ప‌వ‌న్ కళ్యాణ్ గారు ఈ పాట పాడార‌ని ఆయ‌న తెలిపాడు.

అయితే స‌డెన్ గా ఈ పాట‌ను పాడ‌టానికి ప‌వ‌న్ ఎందుకు లైన్ లోకి వ‌చ్చాడ‌నేది మాత్రం పెంచ‌ల్ దాస్ వెల్ల‌డించలేదు. ఇదిలా ఉంటే లైలా సినిమాలో పెంచ‌ల్ దాస్ పాడిన ఓహో ర‌త్త‌మ్మ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విశ్వ‌క్ కు జోడీగా ఆకాంక్ష శ‌ర్మ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.