Begin typing your search above and press return to search.

KBC షోలో పవన్ పై ప్రశ్న- ఏమని అడిగారంటే?

2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యాక్టర్ ఎవరు? అని బిగ్ బీ.. కంటెస్టెంట్ ను అడిగారు.

By:  Tupaki Desk   |   14 Sept 2024 11:46 AM IST
KBC షోలో పవన్ పై ప్రశ్న- ఏమని అడిగారంటే?
X

స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించిన ఆయన.. కొత్త చరిత్ర సృష్టించారు. జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21కి 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. వారిని విజయ పథంలో నడిపించి సత్తా చాటిన పవన్ పేరు.. దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

అయితే పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెట్టి.. ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా విజయవాడ వరదల విషయంలో కూడా తన మార్క్ పాలనను చూపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం కౌన్ బనే కరోడ్ పతి షోలో ప్రశ్న అడగడం ఇప్పుడు వైరల్ గా మారింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ లో ఓ కంటెస్టెంట్ కు ఆ ప్రశ్న ఎదురైంది.

2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యాక్టర్ ఎవరు? అని బిగ్ బీ.. కంటెస్టెంట్ ను అడిగారు. దీంతో ఆ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ ను కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఆడియన్స్ లో 50 శాతానికి మందికి పైగా పవన్ కళ్యాణ్ అని తెలిపారు. దీంతో కంటెస్టెంట్.. పవన్ పేరును ఆన్సర్ గా చెప్పారు. అదే రైట్ ఆన్సర్ అవ్వడంతో.. రూ.1.60లక్షలు గెలుచుకుని గేమ్ ముందుకు పోనిచ్చారు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ రేంజ్ నేషనల్ వైడ్ గా వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు చెబుతున్నారు. మరోవైపు, పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నాయి. త్వరలోనే రీస్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో చిత్రీకరణ చేయనున్నామని డీవీవీ దానయ్య ఇటీవల అంగీకరించారు. త్వరలోనే మొదలు పెడుతున్నట్లు తెలిపారు.

సుజిత్ డైరెక్షన్ లో ఓజీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తున్నారు పవన్. వీటితోపాటు హరిహర వీరమల్లు మూవీలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి అంచనాలు నెలకొల్పాయి. అదిరే రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో పవన్ అప్ కమింగ్ మూవీస్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మరి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో వేచి చూడాలి.