పవన్ కోసం మళ్ళీ అతనొస్తే..
వారి కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ భారీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.
By: Tupaki Desk | 19 Dec 2024 5:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సింగర్ రమణ గోగుల కాంబినేషన్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. వారి కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ భారీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. పవన్ సినిమాల్లో రమణ గోగుల ఆలపించిన సాంగ్స్ అన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పటికప్పుడు వాటిని విన్నా.. కొత్తగానే అనిపిస్తుంటాయి.
అంతలా మ్యూజిక్ లవర్స్ ను మెప్పించాయి. అయితే ఒకప్పుడు తన పాటలతో ఇండస్ట్రీని ఏలిన రమణ గోగుల.. కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సంక్రాంతి వస్తున్నాం చిత్రంతో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు రమణ గోగుల.
ఆ సినిమాలో ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ ను ఆయన పాడగా.. వేరే లెవెల్ హిట్ అయింది. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసినా ఆ సాంగే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతూనే ఉంది.
అనేక ఏళ్ల తర్వాత రమణ గోగుల పాట పాడగా.. అంతా రిపీటెడ్ మోడ్ లో వింటున్నారు. మైండ్ నుంచి పోవడం లేదని అంటున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో సినిమాలో కూడా సాంగ్ పాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్లీ వింటేజ్ కాంబోను చూడాలనుకుంటున్నామని అంటున్నారు.
అయితే రీసెంట్ గా రమణ గోగుల గారితో ఓజీ సినిమాలో ఒక సాంగ్ పాడించాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమన్ ఇప్పటికే ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అందులో రమణ గోగుల.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో నేతగా ఆయన ఎదిగారని కొనియాడారు. చాలా కష్టపడుతున్నారని అన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మెసేజ్ రూపంలో విషెస్ చెప్పానని వెల్లడించారు.
ఆయన చాలా బిజీగా ఉన్నారని, తన విషెస్ చూశారో లేదోనని అన్నారు. అయితే వెంకీ మూవీ తాను పాడిన కొత్త సాంగ్ విన్నారో లేదో తెలియదని రమణ గోగుల చెప్పారు. బహుశా విని ఉంటారని, కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. పవన్ మూవీలో ఒక పాట పాడేయండని కోరుతున్నారు. అది కచ్చితంగా జరిగేలా ఉందని సినీ పండితులు చెబుతున్నారు.