అనన్య నాగళ్ల విరాళంపై పవన్ ఏమన్నారంటే!
వరద బాధితలకు అండగా తెలంగాణ తెలుగు నటి అనన్య నాగళ్ల నిలిచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Sept 2024 4:14 PM ISTవరద బాధితలకు అండగా తెలంగాణ తెలుగు నటి అనన్య నాగళ్ల నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదు లక్షలు విరాళంగా ప్రకటించి తన మంచి మనసు చాటుకుంది. ఒక్కో రాష్ట్రానికి 2.5 లక్షలు చొప్పున కేటాయించి నా ప్రజల్ని కష్ట కాలంలో ఆదుకోవాలంటూ ఎంతో చొరవ చూపింది. అనన్య విరాళం ప్రకటిం చగానే ప్రజలంతా ఎంతో సంతోష పడ్డారు. మన తెలుగు నటి మన కోసం నిలబడిందంటూ ఆమెకి సెల్యూట్ చేసారు.
ఆమెని స్పూర్తిగా తీసుకుని మరింత మంది హీరోయిన్లు ముందుకు రావాలని నెటి జనులు అభిప్రాయపడ్డారు. నిజానికి అనన్య టాలీవుడ్ లో అంత బిజీ నటి కాదు. రోజు పారితోషికం కూడా అంత ఉండదు. కానీ కేవలం తన దాతృహృదయంతోనే అంత పెద్ద సహాయం చేసింది. చిన్న నటి అయినా పెద్ద సహాయం అంటూ అంతా ఆమెని దీవించారు. ఈ నేపథ్యంలో తాజాగా అనన్య విరాళంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు.
దీంతో అనన్య ఆనందానికి అవదుల్లేవ్. తన అభిమాన నటుడు, తనకు స్పూర్తిగానిలిచిన నటుడు నుంచి అభినందన రావడంతో సంతోషం వ్యక్తం చేసింది. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. పవన్ ఎప్పటికీ తనకి స్పూర్తి అని తెలియజేసింది. పవన్ ట్వీట్ తో మరోసారి మిగతా నటీనటులు, హీరోయిన్లు కూడా ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని నెటిజనులు కోరుతున్నారు.
అలాగే అనన్యకి స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అవకాశాలివ్వాలని కోరుతున్నారు. ఆమెకి అవకాశా లిస్తారా? లేదా? అన్నది పక్కనెబడితే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం అనన్య నిలిచిపోతుంది. `మల్లేశం` సినిమాతో అనన్యకి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `వకీల్ సాబ్` లోనూ నటించింది.