OG - వీరమల్లు.. అసలు పవన్ బ్యాలెన్స్ వర్క్ ఎంత?
హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవ్వగానే, OGకు పవన్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. కానీ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ జాప్యం అవుతోంది.
By: Tupaki Desk | 28 Nov 2024 2:45 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో హరిహర వీరమల్లు ప్రాధాన్యతతో ముందుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కోసం మేకర్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఇప్పటివరకు మిగిలి ఉన్న భాగం పూర్తిచేయడానికి మేకర్స్ కేవలం 5-7 పనిదినాలు మాత్రమే అవసరమని తెలిపారు.
హరిహర వీరమల్లు షూటింగ్ విషయానికి వస్తే, యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ పరిసరాల్లో వేసిన సెట్లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఇక సినిమాను 2025 మార్చి 28, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ దీనికి ముందుగానే షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం అనేది సవాలుగా మారింది.
మరోవైపు OG మేకర్స్ కూడా పవన్ నుంచి 3 వారాల డేట్స్ కోరుతున్నారు. OG సినిమాకు సంబంధించి కూడా చాలా హైప్ ఉంది. ఈ సినిమాను దాదాపు 20 పనిదినాల్లో పూర్తి చేయాల్సిన పనులు ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు. అందులో భాగంగా, బ్యాంకాక్ షెడ్యూల్‌తో సహా అన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అయితే, OG షూటింగ్ పూర్తయ్యే సమయం ఇంకా స్పష్టత రాలేదు. మేకర్స్ ఇప్పటికే ప్రీ-ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం, OGని 2025లోనే విడుదల చేయాలని నిర్ణయించారు.
హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవ్వగానే, OGకు పవన్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది. కానీ పవన్ రాజకీయ పనులతో బిజీగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ జాప్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కాల్షీట్స్ వల్ల ఈ రెండు ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. ప్రత్యేకించి OG విషయమై డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డివివి దానయ్యలు పవన్ సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
రెండు ప్రాజెక్టులూ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో ఆడియెన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లుకి ఉన్న బడ్జెట్, భారీ సెట్లు ఈ సినిమాను ప్రత్యేకంగా హైలెట్ చేసే అవకాశం ఉంది. అలాగే, OG ఒక యాక్షన్ డ్రామాగా ఉండగా, ఇది పవన్ కెరీర్లో మరో వినూత్న ప్రాజెక్టుగా నిలవనుంది. సమయానుకూలంగా పవన్ కాల్షీట్స్ ఇచ్చి, ఈ రెండు సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తే, 2025లో ఆయన నుంచి రెండు పెద్ద సినిమాలు రావచ్చు. మరి, పవన్ కాల్షీట్స్ ఎలా ప్లాన్ చేస్తారో, ఈ సినిమాల అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి.