2025… పవర్ స్టార్ అభిమానులకు ట్రిపుల్ బోనంజా
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 14 Sep 2024 4:07 AM GMTఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఓ వర్గం ఫ్యాన్స్ సినిమాలు కోరుకుంటున్నారు. ఆయన కమిట్ అయిన 3 సినిమాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా 2025 లో ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది.
పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు వరుసుగా ఫినిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలు దర్శకులు షూటింగ్ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ కోసం విజయవాడలోనే ఏర్పాట్లు జరిగాయి. హరిహర వీరమల్లు షూటింగ్ సెప్టెంబర్ ఆఖరిలో లేదంటే అక్టోబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉందంట.
దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ మూవీ షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టబోతున్నారు. విశాఖపట్నంలో సుజిత్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి సెట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా అక్టోబర్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ఈ నాలుగు నెలల్లో హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్ కంప్లీట్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారంట. వీటి తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది.
అలాగే ఓజీ సినిమాని 2025 మార్చి ఆఖరిలో లేదంటే ఏప్రిల్ ఆరంభంలో రిలీజ్ చేసే అవకాశం ఉందంట. తర్వాత హరిహర వీరమల్లో మే లేదా జూన్ నెలలో ప్రేక్షకులు ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇంచుమించు రెండు నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 2025 ఆఖరిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేయడానికి హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది.
ఏ విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ మూడు సినిమాల కూడా 2025 లో ట్రిపుల్ బొనాంజాగా అభిమానులను అలరించడం గ్యారెంటీ అని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మొదటిసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయినట్లు అవుతుంది. ఈ మూడు సినిమాలు పైన కూడా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కచ్చితంగా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.