పవన్ కల్యాణ్ ఉన్నాడు.. చరణ్ ఉన్నాడు అంటే.. చిరంజీవి ఉన్నాడు గనుకే
ఎన్నడూ లేని విధంగా పవన్ స్పీచ్ కొంత పొలిటిసైజ్ అయినా కానీ, సుదీర్ఘంగా సాగిన స్పీచ్ లో చాలా అంశాలు కవర్ అయ్యాయి.
By: Tupaki Desk | 4 Jan 2025 4:19 PM GMTరాజమండ్రిలో నేటి సాయంత్రం జరిగిన 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేడుకకు భారీగా మెగా జనసందోహం తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీరాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై మెగా అతిథి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పీచ్ ఆద్యంతం ఎమోషనల్ గా సాగింది. ఎన్నడూ లేని విధంగా పవన్ స్పీచ్ కొంత పొలిటిసైజ్ అయినా కానీ, సుదీర్ఘంగా సాగిన స్పీచ్ లో చాలా అంశాలు కవర్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానీకానికి .. ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న అశేష ప్రేక్షకులకు నమస్సులు.. మీడియాకు అభిమానులు అందరికీ నమస్కారాలు. పవన్ కల్యాణ్ అభిమానులకు కూడా నా హృదయ పూర్వక నమస్కారాలు.. అంటూ స్పీచ్ ని లైటర్ వెయిన్ లో ప్రారంభించిన పవన్ కల్యాణ్.. సినీపరిశ్రమ మూలాల గురించి వేదికపై ప్రస్థావించిన తీరు అహూతులను ఆకట్టుకుంది.
మన సినిమా మూలాలను మరువకూడదు. రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కేను మర్చిపోలేం.. రాజ్ కపూర్ ని, సత్యజిత్ రేని, షోలే తీసిన సిప్పీని, తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నాగిరెడ్డి , బిఎన్ రెడ్డి, గూడవల్లి రామబ్రమ్మం గారిని మర్చిపోలేం.. ఈ రోజున శంకర్ లాంటి నిష్ణాతులు.. సూర్య లాంటి నటుడు- దర్శకుడు ఉన్నారంటే... ప్రతిదానికి మూలాల్ని మర్చిపోకూడదు.. తెలుగు పరిశ్రమ పెద్దల్ని గుర్తు చేసుకుంటూ .. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆ రామారావు గారిని స్మరించుకుంటూ.. ఈ మాటలు చెబుతున్నాను..
నేడు పవన్ కల్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరు అందరూ గేమ్ ఛేంజర్ అనొచ్చు.. ఓజీ అనొచ్చు.. ఆ మూలాలు ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో మొదలయ్యాయి. మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ.. నర్సాపూర్ కాలేజ్ లో చదువుకుంటూ.. ఆద్యుడు చిరంజీవిగారేనని పవన్ అన్నారు. వేదిక దిగువన అభిమానుల్లో కోలాహాలం చూస్తూ.... కళ్యాణ్ బాబు అనండి..ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి.. ఏదన్నా మూలాలు ఆయనే .. నేను మూలాలను మర్చిపోను. ఫాల్కే.. రఘుపతి వెంకయ్య, ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేమని పవన్ అన్నారు.
తెలుగు చిత్రసీమ కదిలి హైదరాబాద్ కి వచ్చింది అంటే.. ఏఎన్నార్, రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబు వంటి వారి వల్లనే.. ఎందరో పెద్దలు తెలుగు సినిమా కోసం శక్తియుక్తులను ధారపోసారు. ఒక నటుడిగానే కాదు.. ఆంధ్రప్రదేశ్ డిప్యటీ సీఎం గా వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈరోజున ఈ వేదికకు ఇంత బలంగా .. ఒక ఫిలిం ఫంక్షన్ ఇక్కడ జరుపుకున్నామంటే కూటమి ప్రభుత్వ సహకారంతోనే. అనుభవజ్జలైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సహకారం, నిరంతర మద్ధతుతో ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నాం. రాజమమండ్రిలో వేదికకు అవకాశం ఇచ్చినందుకు వారికి థాంక్స్. . హోమ్ మంత్రి అనిత, డీజీపీ గారికి, ఎస్పీ గారికి అధికార యంత్రాంగానికి థాంక్స్.. అని పవన్ అన్నారు.
ఇదే వేదికపై పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజులపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా మెగా కుటుంబం నుంచి హీరోల మనుగడ లేదా ఉనికికి ఏకైక కారకుడు మెగాస్టార్ చిరంజీవి అంటూ పవన్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ మెగాభిమానులను కదిలించింది. పవన్ నుంచి ఇలాంటి స్పీచ్ ఊహించనిది.