Begin typing your search above and press return to search.

వీరమల్లు మలి పోరుకి ఎన్నికల ఫలితాల లింక్‌..!

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ప్రారంభం అయ్యి రెండేళ్లకు పైగానే అయ్యింది.

By:  Tupaki Desk   |   20 May 2024 4:30 PM GMT
వీరమల్లు మలి పోరుకి ఎన్నికల ఫలితాల లింక్‌..!
X

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ప్రారంభం అయ్యి రెండేళ్లకు పైగానే అయ్యింది. అయినా ఇప్పటి వరకు సినిమా పూర్తి అవ్వలేదు. ఆ మధ్య ఈ సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు ఆ అనుమానాలకు తెర దించుతూ వచ్చారు.

ఇటీవలే సినిమాను రెండు పార్ట్‌ లుగా రూపొందిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా ఇక పై సినిమా యొక్క దర్శకత్వ బాధ్యత క్రిష్ నుంచి జ్యోతి కృష్ణ చేతికి వెళ్లినట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ సినిమా షూటింగ్ ను జూన్‌ మూడో లేదా నాల్గవ వారం నుంచి పునః ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించింది. వీరమల్లు మలి పోరు భీకరంగా ఉండబోతుందని, భారీ ఎత్తున యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ జ్యోతికృష్ణ సన్నిహితుల నుంచి సమాచారం వచ్చింది.

జూన్‌ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ కు జరిగిన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం రెండు మూడు వారాల సమయం అయినా పడుతుంది. వైకాపా మళ్లీ గెలిస్తే పవన్‌ వెంటనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ కు జాయిన్ అవ్వచ్చు.

ఒక వేళ కూటమి అధికారాన్ని దక్కించుకుంటే మాత్రం పవన్‌ కళ్యాణ్ ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఉప ముఖ్యమంత్రి అలాగే రెండు మూడు కీలక మంత్రుత్వ శాఖలు పవన్ కళ్యాణ్ వద్దకు వస్తాయి అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అందుకే కూటమి అధికారంలోకి వస్తే హరి హర వీరమల్లు మలి పోరుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి, పరిపాలన మొదలు అయ్యి అన్నీ సర్ధకున్న తర్వాత పవన్ షూటింగ్‌ కు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ అయినా పట్టవచ్చు అనేది కొందరి అభిప్రాయం. ఏం జరుగుతుందో చూడాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.