Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ ఎప్పుడు దిగుతాడో తెలియదు కానీ..

అయితే పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎం గా తన విధులు నిర్వహిస్తూనే హీరోగా మూవీస్ కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 1:30 PM GMT
పవర్ స్టార్ ఎప్పుడు దిగుతాడో తెలియదు కానీ..
X

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో బిజీ అయిపోయారు. రెగ్యులర్ గా తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల గురించి తెలుసుకోవడానికి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు గత ఐదేళ్లలో ఆయా శాఖల పనితీరు ఎలా నడిచింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పూర్తిగా ప్రభుత్వ పనులలోనే బిజీగా ఉన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎం గా తన విధులు నిర్వహిస్తూనే హీరోగా మూవీస్ కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే ఏఎం రత్నం ప్రొడక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా కూడా 20-25 రోజులు కాల్ షీట్స్ ఇస్తే కంప్లీట్ అయిపోతుందంట. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.

ఇప్పటికే నిర్మాతలకి కూడా పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలు ఫినిష్ చేస్తానని ప్రామిస్ చేసారంట. అయితే వారంలో ఓ రెండు, మూడు రోజులు మాత్రమే షూటింగ్స్ కోసం కేటాయిస్తానని చెప్పారంట. దానికి నిర్మాతలు కూడా ఒకే చెప్పారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ముందుగా ఓజీ సినిమాని ముందుగా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందంట. దీని తర్వాత హరిహరవీరమల్లు సినిమా కోసం డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంది.

తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ కావొచ్చు. తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలో స్టార్ట్ చేద్దామని క్లారిటీ ఇచ్చారని హరీష్ శంకర్ అన్నారు. ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు ఆల్ మోస్ట్ ఫినిష్ దశలో ఉన్నాయని, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఇంకా 80 శాతం షూటింగ్ చేయాల్సి ఉందని హరీష్ శంకర్ తెలియజేశారు.

అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లకి డేట్స్ కేటాయించే అవకాశం ఉందంట. ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు కానీ ఒక రోజు ముందు చెప్పినా కూడా నిర్మాతలు దర్శకులు సిద్ధంగా ఉండాలని ముందుగానే ఒక హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ముందుగా కంప్లీట్ చేస్తే సుజిత్ నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు. హరిహర వీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి కాస్తా ప్లానింగ్ తో చేయాల్సి ఉంది. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూనే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తారంట. అంటే ఇకపై పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేయబోతున్నాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.