Begin typing your search above and press return to search.

పవన్ బ్రో మళ్ళీ రీమేక్ స్టొరీనా?

అయితే ఇప్పుడు మరో రీమేక్ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 11:12 AM
పవన్ బ్రో మళ్ళీ రీమేక్ స్టొరీనా?
X

బ్రో సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏకంగా 30 కోట్ల వరకు బయ్యర్లకి బ్రో సినిమాతో నష్టం వచ్చినట్లు సినీ వర్గాలలో వినిపిస్తోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఒజీ మూవీపైన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. బ్రో సినిమా తమిళ్ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రీమేక్ కథగానే తెరకెక్కుతోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కెరియర్ లో రీమేక్ లద్వారానే ఎక్కువ సక్సెస్ లు అందుకున్నారు. స్ట్రైట్ కథలతో మూవీస్ చేసన సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. గబ్బర్ సింగ్ మూవీ కూడా దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన చిత్రమే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉండటం వలన ఇప్పుడు రీమేక్ సినిమాల విషయంలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ని రీమేక్ కింగ్ గా అభివర్ణిస్తున్నారు.

అయితే బ్రో సినిమాతో రీమేక్ సినిమాలు వర్క్ అవుట్ అవ్వవనే క్లారిటీగా పవర్ స్టార్ అభిమానులు కూడా వచ్చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ శంకర్ ఏదో ఒక మాయ చేస్తాడని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో రీమేక్ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గతంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

అయితే ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకని భావించి మరో తమిళ్ హిట్ మూవీ రీమేక్ చేయాలని అనుకుంటున్నారంట. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా తెరకెక్కిన విక్రమ్ వేదా చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారంట. ఈ న్యూస్ బయటకి రాగానే పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అస్సలు రీమేక్ కథల జోలికి వెళ్లొద్దు అనే సలహాలు ఇస్తున్నారు. బ్రో లాంటి డిజాస్టర్ తర్వాత కూడా మళ్ళీ మరో తమిళ్ మూవీ రీమేక్ చేస్తూ కోరి విమర్శలు చేయించుకోవడం ఎందుకంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీమేక్ అయిన, ఒరిజినల్ కథ అయిన పవన్ కళ్యాణ్ ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తే హిట్ ఖాయం అని కొంతమంది అభిమానులు సమర్ధిస్తున్నారు. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.