పవన్ రిజల్ట్.. టాలీవుడ్ టాక్ ఏంటి?
పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ దక్కుతుందో గాని ఓడిపోతే మాత్రం సపోర్ట్ చేసిన వారికి ఝలక్ లు తగిలే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
By: Tupaki Desk | 14 May 2024 5:56 AM GMTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీ నుంచి లభించిన మద్దతు చాలా తక్కువ. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా ప్రత్యక్షంగా వచ్చి మద్దతు ఇచ్చింది చాలా తక్కువ. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ప్రచారాల్లో కూడా పాల్గొనడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుపై చాలా ధీమాగా కనిపించారు. మెగా యువ హీరోలు ప్రచారాలు కూడా చేశారు. సాధారణంగా పవన్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను పాలిటిక్స్ లోకి రావద్దని చెబుతాడు.. అభిమానం ఉన్న ఆర్టిస్టులను కూడా దూరంగా ఉండమని అంటాడు. కానీ ఈసారి ఆయన ఎవరికి పెద్దగా అడ్డు చెప్పలేదు. గెలుపు కోసం ఆయన అన్ని దారుల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారని అనిపించింది.
మెగా ఫ్యామిలీతో పాటు నేచురల్ స్టార్ నాని లాంటి హీరోలు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలవడం విశేషం. సినిమా ఇండస్ట్రీ నుంచి గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ ప్రభావం పిఠాపురం రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా అందరిలో మెదులుతున్న ప్రశ్న.
కూటమి గెలుస్తుందా లేదా అనే విషయం కంటే కూడా పవన్ కళ్యాణ్ గెలుపు పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. ఆయన గెలుస్తాడని నమ్మకంగా ఎంతమంది చెబుతున్నారో.. ఓడిపోతారు అని కూడా అదే తరహాలో మరి కొంతమంది వారి అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సినిమా ఇండస్ట్రీలో కొందరు వ్యతిరేకంగానే ఉన్నారు.
ఆ ప్రభావం కూడా పవన్ కళ్యాణ్ కు బాగా కలిసి వచ్చింది. ఇక మరి కొంతమంది వైసీపీకి మద్దతుగా ఉన్నవారు పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ధీమాగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ దక్కుతుందో గాని ఓడిపోతే మాత్రం సపోర్ట్ చేసిన వారికి ఝలక్ లు తగిలే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ఇక ఇండస్ట్రీలో సపోర్ట్ ను బట్టి పవన్ గెలుపు కాయం అనే మాట ఎక్కువ వినిపిస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది ఎవరికి సపోర్ట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. గెలిచిన తరువాత విషెస్ అందిస్తే సరిపోయే.. అనే మైండ్ సెట్ తో ఉంటారు. కానీ ఈసారి పవన్ కు దక్కిన మద్దతు చూస్తుంటే వార్ వాన్ సైడ్ అయ్యిందేమో అనేలా పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.