Begin typing your search above and press return to search.

పవన్ పుట్టినరోజు.. నెట్టింట ఏం వైరల్ అవుతుందో తెలుసా?

దానిలో పవన్ ఇంటి పేరుతో పాటు, ఆయన గోత్రం, నక్షత్రం, రాశి లాంటి వివరాలను కూడా షేర్ చేస్తుండటం విశేషం.

By:  Tupaki Desk   |   1 Sept 2023 9:02 PM IST
పవన్ పుట్టినరోజు.. నెట్టింట ఏం వైరల్ అవుతుందో తెలుసా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజానికి ఫ్యాన్స్ అనే కంటే భక్తులకు ఉన్నారని చెప్పొచ్చు. మామూలుగానే ఆయన మీద ఉన్న ప్రేమను చూపించడానికి వారు ఎప్పుడూ ముందుంటారు. అలాంటిది ఆయన పుట్టినరోజు వస్తే ఊరుకుంటారు. మాములుగా కంటే ఎక్కువ హడావిడి ఉంటుంది.

రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ బర్త్ డే సెలబ్రేషన్సే జరుగుతాయి. ఆయన కట్ అవుట్స్ కుప్పల కొద్దీ వెలుస్తాయి. అంతేకాదు, ఆయన పేరిట ఫ్యాన్స్ గుడిలో పూజలు, హోమాలు లాంటివి చేపిస్తూ ఉంటారు. రేపు పుట్టిన రోజు కాగా, ఈ రోజే సోషల్ మీడియాలో సందడి మొదలైంది. ముఖ్యంగా పవన్ పేరిట ఎవరైనా గుడిలో పూజ చేయించాలి అనుకుంటే, ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దానిలో పవన్ ఇంటి పేరుతో పాటు, ఆయన గోత్రం, నక్షత్రం, రాశి లాంటి వివరాలను కూడా షేర్ చేస్తుండటం విశేషం. పేరు కొణిదెల కళ్యాణ్ బాబు అని, జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం అని చెబుతున్నారు. ఈ పూర్తి వివరాలు చెప్పి, మరీ గుడిలో పూజలు, అర్చన, అభిషేకాలు లాంటివి చేపించండి అని పవన్ ఫ్యాన్స్ చెబుతుండటం విశేషం.

ఇక, పవన్ ఈ పుట్టిన రోజుతో 51 పూర్తి చేసుకొని 52వ పడిలోకి అడుగుపెడుతున్నారు. నిజానికి ఆయన తన పుట్టిన రోజును గ్రాండ్ గా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోరు. అందరు హీరోలు, రాజకీయ నాయకుల్లాగా తన బర్త్ డే కి హడావిడీలు, కేక్ కట్ చేయడాలు లాంటివి కూడా చేయరు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే హడావిడి చేస్తారు. పవన్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.

ఇక, పవన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో పవన్ కూడా సినిమాలు పక్కన పెట్టి, పూర్తిగా ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.