పవన్ ఫ్యాన్స్ vs అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ గొడవ పీక్స్
మరో వైపు చిత్తూరు శేషాచలం అడవులలో విచ్చలవిడిగా జరుగుతున్న స్మగ్లింగ్ పైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు.
By: Tupaki Desk | 9 Aug 2024 8:22 AM GMTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో పలు జిల్లాలలో ఏనుగులు జన సంచారంలోకి వచ్చేసి పంటలని ధ్వంసం చేస్తున్నాయి. అలాగే ప్రజల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. అయితే ఏనుగులని అడవిలోకి పంపించే ఏర్పాట్లపై పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారు. మరో వైపు చిత్తూరు శేషాచలం అడవులలో విచ్చలవిడిగా జరుగుతున్న స్మగ్లింగ్ పైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఈ సందర్భంగా బెంగుళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఏపీలో ఏనుగులని అడవిలోకి తరలించడానికి కొన్ని ఏనుగులని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వారిని కోరారు. ఈ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అడవులని రక్షించేవారిని సినిమాలలో హీరోలుగా చూపించేవారు. ఇప్పుడు అడవులని ధ్వంసం చేస్తూ స్మగ్లింగ్ చేసేవారిని హీరోలుగా చూపిస్తున్నారు.
హీరోలు కూడా అలాంటి పాత్రలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. నా వరకైతే అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడను అని చెప్పారు. అయితే ఈ జెనరేషన్ లో వస్తున్న కథల శైలిపై పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అయ్యారు. కానీ చివరిగా స్మగ్లింగ్ కథాంశంతో వచ్చిన సినిమా అంటే పుష్పనే. ఆ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారంటూ బన్నీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. పుష్ప సినిమాలో కేవలం బన్నీ నటించాడు. రియల్ లైఫ్ లో అతను చాలా బాధ్యతగా ఉంటాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున క్యాంపైన్ చేశారు. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానులకి కోపం తెప్పించాయి. కావాలనే అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై జనసైనికులు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తున్నారు. మెగా, అల్లు ఫ్యాన్స్ విడిపోయి సోషల్ మీడియాలో ట్వీట్స్ తో యుద్ధం చేసుకుంటున్నారు. ఈ ఫైట్ కి ఎలా ముగింపు పడుతుందనేది చూడాలి.