అన్నయ్య రికార్డును తమ్ముడు బ్రేక్ చేస్తారా?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Aug 2024 10:19 AM GMTసినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తోపాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో వన్స్ మోర్ అంటున్నారు సినీ ప్రియులు. అయితే మిగతా వాటితో పోలిస్తే తెలుగులో కాస్త ఎక్కువ చిత్రాలు.. అప్పట్లో సూపర్ హిట్ అయ్యి.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. హీరోల బర్త్ డే తోపాటు స్పెషల్ అకేషన్స్ సందర్భంగా సినిమాలను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీగా వసూళ్లు కూడా వస్తుండడంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
4కే క్వాలిటీతో ఇప్పుడు రిలీజ్ అవుతున్న అప్పటి చిత్రాలను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లకు తరలి వస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర రీరిలీజ్ అవ్వగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది. 22 ఏళ్ల క్రితం.. థియేటర్లలో ఎలాంటి సందడి నెలకొందో ఇప్పుడు అంతకుమించి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో కలెక్షన్లు వచ్చాయి. అదిరిపోయే రీతిలో 61,700 డాలర్లు వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది!
అయితే అన్న వంతు అయింది.. ఇప్పుడు తమ్ముడు వంతు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పవన్ బర్త్ డే సందర్భంగా.. ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. నా తిక్కేంటో చూపిస్తా' అంటూ పవన్ చెప్పిన డైలాగులకు మరోసారి ఈలలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్.. అప్పుడు ఎలా ఉర్రూతలూగించిందో ఇప్పుడు కూడా అదే మేనియాను రిపీట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 100కు పైగా లొకేషన్లలో రీరిలీజ్ కానుంది. అక్కడ సెప్టెంబర్ 1వ తేదీ హాలీడే కావడంతో పెద్ద ఎత్తున వసూళ్లు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. దీంతో ఫ్యాన్స్ టికెట్లను తెగ కొనేస్తున్నారు. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలోని 55 స్క్రీన్లలో 15వేల డాలర్లను ప్రీబుకింగ్స్ రూపంలో వసూలు చేసింది గబ్బర్ సింగ్.
దీంతో ట్రేడ్ పండితులు షాక్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా గబ్బర్ సింగ్ నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మూవీ దూసుకెళ్తుందని అంటున్నారు. అంతే కాదు.. ఇటీవల వచ్చిన చిరంజీవి ఇంద్ర రీరిలీజ్ రికార్డును కూడా గబ్బర్ సింగ్ బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి గబ్బర్ సింగ్ కు ఎలాంటి వసూళ్లు వస్తాయో.. ఇంద్ర కలెక్షన్లను క్రాస్ చేస్తుందో లేదో వేచి చూడాలి.