Begin typing your search above and press return to search.

గులాబీల గ‌జ‌మాల‌తో జ‌న‌సేనానికి మెగా వెల్‌క‌మ్

అన్న వ‌దిన‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ బాండింగ్ మ‌రోసారి ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 5:40 PM GMT
గులాబీల గ‌జ‌మాల‌తో జ‌న‌సేనానికి మెగా వెల్‌క‌మ్
X

ఇటీవలి AP ఎన్నికలలో భారీ విజయం తర్వాత న్యూఢిల్లీలో NDA మొదటి ప్రధాన సమావేశంలో పాల్గొన్న జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. త‌న కుటుంబ స‌భ్యుల న‌డుమ విజ‌య‌గ‌ర్వంతో క‌నిపించారు. అన్న వ‌దిన‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ బాండింగ్ మ‌రోసారి ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది.

విజేత అయిన ప‌వ‌న్ కి కుటుంబ సభ్యులందరి నుండి ఘ‌న‌మైన‌ స్వాగతం లభించింది. ముందుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ .. బాబాయ్ పవన్ కళ్యాణ్ ని రిసీవ్ చేసుకున్నారు. పవన్ క‌ల్యాణ్ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించే క్ర‌మంలో అతడికి గులాబీల పుష్ప‌గుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికిన తీరు మ‌నోహ‌రంగా క‌నిపించింది.

త‌న‌ తోబుట్టువులంతా ఎంతో ఆనందంగా అక్కడకు వచ్చారు. అక్కడ గుమిగూడిన మెగా మదర్ నాగ‌బాబు, శ్రీమతి అంజనా దేవి చరిత్రలో కొత్త సంపుటిని రచించిన జ‌న‌సేనాని అద్భుతమైన విజయానికి సంపూర్ణ ఆనందంతో త‌న‌ని కౌగిలించుకోవడానికి ఆత్రుత‌ను క‌న‌బ‌రిచారు. ప‌వ‌న్ వ‌దిన‌గారు, శ్రీమతి సురేఖ కొణిదెల‌, అంజ‌నా దేవి గారు సహా మహిళామణులంతా జ‌న‌సేనానిపై అపార‌మైన ప్రేమాభిమానాల‌ను, ఆప్యాయతల‌ను ప్ర‌ద‌ర్శించారు.

అదే క్ర‌మంలో జ‌న‌సేనాని నేరుగా మెగాస్టార్ లాంజ్‌కి చేరుకున్న తర్వాత మెగాస్టార్ త‌న‌ను రిసీవ్ చేసుకోవడానికి ఎదురుగా వచ్చారు. పవన్ ఊహించని రీతిలో మెగాస్టార్ చిరంజీవి పాదాలకు నమస్కరించి తన భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌ను క‌న‌బ‌రిచారు. ప్రతిగా చిరంజీవి పవన్ కళ్యాణ్‌ను భారీ గులాబీల దండతో సత్కరించారు. ఆపై ఆనందంగా త‌మ్ముడిని ఆలింగ‌నం చేసుకుని ప్రేమను కురిపించారు. అనంతరం `కల్యాణ్ బాబు, హ్యాట్సాఫ్` అని రాసిన పసుపు రంగు కేక్‌ను క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేశారు. ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.