హరిహర వీరమల్లు.. జస్ట్ మిస్!
పవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే హంగామా ఎలా ఉండాలి. కేక్ కటింగ్స్, బైక్ ర్యాలీలతో అభిమానులు రోడ్లపై హంగామా చేస్తే.. సినిమా అప్డేట్స్ తో మేకర్స్ సోషల్ మీడియాను షేక్ చేసేయాలి.
By: Tupaki Desk | 2 Sep 2023 4:07 PMపవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే హంగామా ఎలా ఉండాలి. కేక్ కటింగ్స్, బైక్ ర్యాలీలతో అభిమానులు రోడ్లపై హంగామా చేస్తే.. సినిమా అప్డేట్స్ తో మేకర్స్ సోషల్ మీడియాను షేక్ చేసేయాలి. అయితే ఈ హడావుడి మొత్తాన్ని కలిపి ఓజీ ఓ గ్లింప్స్ తో తీర్చేసింది కాబట్టి ఓకే. మరి చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు సినిమా పరిస్థితేంటంటే? సమాధానమే లేదు.
కేవలం బర్త్ డే విషెస్ చెప్పి సింపుల్ గా ఓ పోస్టర్ తో చేతులు దులిపేసుకుంది. నిజానికి ఈ సినిమా నుంచి ఇప్పటికే రావాల్సిన ప్రమోషనల్ మెటీరియల్ ఎప్పుడో చాలానే వచ్చేసింది. పవన్ కల్యాణ్ బరిలో దిగి ఉస్తాదుల్ని మట్టికరిపించే వీడియోలు, కత్తి సాములు చేస్తున్న ఫొటోషూట్ లు, రౌద్రంతో ఉన్న పోస్టర్లు చూసేశాం. కాకపోతే ఆ తర్వాతే ఏం అయిందో క్లారిటీగా తెలీదు సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్ కూడా జరుపుకోవట్లేదు.
అయితే ఈ పుట్టినరోజు నాడు ఏదైనా అప్టేడ్ ట్రీట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు ఫ్యాన్స్ కోసం.. మంచి గ్లింప్స్ రెడీ చేద్దాం అని మేకర్స్ అనుకున్నారట మేకర్స్. అందుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని తెలిసింది.
మొఘల్ కాలంలోని ఓడ రేవు, సముద్రం ఒడ్డున లంగర్ వేసిన నౌక, అందులో అపారమైన నిధులు.. ఆ నౌకపై వీరమల్లు దాడి చేయడం.. తనకు కావాల్సింది దోచుకుపోవడం వంటి యాక్షన్ సీన్స్ తో ఎపిసోడ్ ఒకటి ఉందట. ఆ ఎపిసోడ్ నుంచే ఓ 40 సెకెన్ల వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేద్దామని భావించారట.
కానీ పవన్ కల్యాణ్ ఏమో ఈ సినిమా కోసం కాల్షీట్లు ఇవ్వట్లేదట. మొన్నటివరకు బ్రో సినిమాకు, ఇప్పుడు ఓజీకి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు మాత్రం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా మరింత ఆలస్యం కానుంది. ఇలాంటి సమయంలో మరో గ్లింప్స్ విడుదల చేస్తే బాగుంటుంది కానీ.. రిలీజ్ చేశాక.. మళ్లీ కాల్షీట్లు లేక సినిమా ఆలస్యమయితే.. మొదటికే మోసం వస్తుందని సైలెంట్ గా ఉన్నారట. అందుకే గ్లింప్స్ ఆలోచనను పక్కనపెట్టి.. పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సరిపెట్టుకున్నారట.