Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్.. యువ హీరో వద్ద పవన్ అప్పు

తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లలో ఒకరిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:16 AM GMT
ఫ్లాష్ బ్యాక్.. యువ హీరో వద్ద పవన్ అప్పు
X

మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అడుగుపెట్టి స్టార్ యాక్టర్ గా ఎదిగారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. వరుస ఫ్లాప్ ల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మార్కెట్ లో పెద్దగా తేడా ఏమీ రాలేదు. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లలో ఒకరిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పటికి ఆయన 50 కోట్లకి పైన రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి తీసుకుంటారు.

ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయిన కేవలం కటౌట్ తోనే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టే సత్తా ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పొచ్చు. అతని సినిమాలకి ఒక్క ప్రీరిలీజ్ ఈవెంట్ పెడితే చాలని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్ గా చెబుతారు. యువతని అత్యధికంగా ప్రభావితం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ అతన్ని ఏపీ సీఎంగా చూడాలని అనుకున్నారు. కానీ డిప్యుటీ సీఎం హోదాలో ఇప్పుడు కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ముందు ఎక్కువగా అప్పులు చేసారంట. అయితే ఆయన అప్పులు చేసింది ఎవరి దగ్గరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర. గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలని వారు గుర్తు చేసుకున్నారు. తనకు అవసరం అనుకుంటే ఎవరి దగ్గర అయిన డబ్బులు తీసుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అయితే చిన్న వయస్సులో మా వదినని డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా అనిపించేది. అందుకే రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఉంటే వడ్డీతో సహా ఇస్తానని తీసుకునేవాడిని అలా చరణ్ దగ్గర నేను చాలా అప్పు చేసాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చరణ్ దగ్గర పాకెట్ మనీ ఉంటే దానినే అప్పుగా తీసుకునేవాడినని పవన్ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ తమ్ముడైన ఒక కొడుకు క్రిందనే చూసుకునేవాడు.

అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ ని గాడిలో పెట్టాలని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఇష్టం లేకపోయిన హీరోగా చేశారు. అయితే తనకి ఇష్టం లేకపోయిన కూడా పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో స్టార్ హీరోగా ఎదిగారు. ఒకానొక దశలో మెగాస్టార్ ఇమేజ్ ని సైతం దాటిపోయే రేంజ్ కి పవన్ కళ్యాణ్ వెళ్లడం విశేషం. ఇప్పుడు కూడా రాజకీయాలలో మెగాస్టార్ చిరంజీవి అందుకోలేని హైట్స్ ని పవన్ కళ్యాణ్ అందుకున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ కూడా చాలా సార్లు గర్వంగా చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎదుగుదల చూసినపుడు ఒక అన్నగా గర్వంగా ఫీల్ అవుతానంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి అంతే రెస్పెక్ట్ ఎప్పటికీ ఇస్తూ ఉంటారు.