Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఆ రెండు ప‌నులు అందుకే చేయ‌లేదా?

అవును ప్రోష‌న‌ల్ గా ఎక్క‌డా లుక్ ప‌రంగా డ్యామేజ్ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ప‌వ‌న్ గ‌డ్డం..హెయిర్ అలాగే మెయింటెన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 Jun 2024 11:30 PM GMT
ప‌వ‌న్ ఆ రెండు  ప‌నులు అందుకే చేయ‌లేదా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంత కాలంగా గుబురు గ‌డ్డం.. లాంగ్ హెయిర్ తోనే క‌నిపిస్తున్నారు. క‌నీసం ట్రిమ్ చేసింది కూడా లేదు. కొన్ని నెల‌లుగా ఇదే లుక్ లోక‌నిస్తున్నారు. క‌నీసం ప్ర‌చారం స‌మ‌యం లోగానీ, ప్ర‌మాణ‌స్వీకారం నాడు గానీ, నేడు శాస‌న స‌భ స‌మావేశాల‌కు హాజ‌రవుతున్న సంద‌ర్భంగా గానీ ఎక్క‌డా ప‌వ‌న్ లుక్ లో ఎలాంటి మార్పు రాలేదు. అప్పుడప్పుడు నెరిసిన త‌ల‌కు రంగు వేయ‌డం త‌ప్ప ప‌వ‌న్ లుక్ ప‌రంగా ఎలాంటి మార్పు తీసుకురాలేదు.

మ‌రి ఇంత స్ట్రిక్ట్ గా ప‌వ‌న్ ఎందుకు ఉన్న‌ట్లు? అంటే దీని వెనుక బ‌ల‌మైన క‌మిట్ మెంట్ ఉంద‌ని తెలుస్తోంది. అవును ప్రోష‌న‌ల్ గా ఎక్క‌డా లుక్ ప‌రంగా డ్యామేజ్ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ప‌వ‌న్ గ‌డ్డం..హెయిర్ అలాగే మెయింటెన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదంతా కేవ‌లం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు', 'ఓజీ' కోస‌మే అంటున్నారు. వీర‌మ‌ల్లు లో ప‌వ‌న్ లాంగ్ హెయిర్ లుక్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార చిత్రాల్లో ఆ హెయిర్ చూడొచ్చు.

అలాగే 'ఓజీ' లో గ‌డ్డం కామ‌న్ గా క‌నిపిస్తుంది. గ్యాంగ్ స్ట‌ర్ సినిమా కావ‌డంతో ఆ పాత్రకి గ‌డ్డం అవ‌స‌రం కాబ‌ట్టి అది మెయింటెన్ చేయ‌క త‌ప్ప‌లేదు. మ‌రి షూటింగ్ గ్యాప్ వ‌చ్చిన‌ప్పుడు ట్రిమ్ చేయోచ్చు! అన్న సందేహం రావొచ్చు. కానీ ప‌వ‌న్ కి ఆఛాన్స్ లేక‌పోయింది. రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్ లో పాల్గొనాలి అన్న‌ది ప‌వ‌న్ ఐడియాన‌ట‌. ప్ర‌చారంతో పాటు కొన్ని రోజుల పాటు పెండింగ్ షూటింగ్ కి స‌మ‌యం కేటాయించాల‌నుకున్నారుట‌.

క‌నీసం వారం రోజులు రెండు రోజులు స‌మ‌యం దొరికినా సెట్స్ కి వెళ్లాల‌నుకున్నారుట‌. అందుకే గ‌డ్డం, లాంగ్ హెయిర్ త‌ప్ప‌క ఉంచారుట‌. కానీ షూటింగ్ చేసే అవ‌కాశం, ఆస్కారం లేక‌పోవ‌డంతో ఆ లుక్ ని అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అలాగే మెయింటెన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకులం దుతున్నాయి. ఇప్ప‌టి నుంచి ఐదేళ్ల పాటు కూట‌మి అధికారంలో ఉంటుంది కాబ‌ట్టి ఎప్పుడైనా షూటింగ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.