పవన్ పెళ్లిళ్ల గోల.. ఇది బండ్లన్న ఆన్సర్
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నాకు దైవ సమానులైన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చాలా అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 13 Oct 2023 7:43 AM GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మరోసారి కామెంట్స్ చేసిన విధానం వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో బండ్ల గణేష్ కూడా తనదైన శైలిలో స్పందించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం తనకు చాలా బాధను కలిగించింది అని ఇప్పుడు కూడా నేను ఈ విషయంపై స్పందించకపోతే నా బతుకు మీద నాకే చిరాకు వస్తుంది అని అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నాకు దైవ సమానులైన పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చాలా అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ గారు ఒక పెద్ద హోదాలో ఉన్నారు. అలాంటివారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పై ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు తెలిసినంతవరకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అవుతూ అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు.
పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. కొందరి జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆయన జీవితంలో కూడా ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగాయి అని నేను భావిస్తున్నాను. కానీ ప్రతిసారి అదే విషయంలో ఆయనపై ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన జీవితంలో ఈ విషయం తప్పితే మరొక విషయం గురించి మాట్లాడడానికి లేదా? ఈ విషయంలో నేను పదేపదే విన్నవిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్నాడు.
ఏ రోజు స్వార్థంతో గాని స్వలాభం కోసం గాని ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. హాయిగా షూటింగ్స్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఒక సూపర్ స్టార్ హోదా తో బతకాలని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఆయన.. ఎందుకు తర్వాత చచ్చిపోతాము కదా.. వెయ్యేళ్లు బ్రతుకుతామా? మనం చనిపోయిన కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలి. జనాలకు ఏదైనా చేయాలి అని ఎప్పుడు సంకల్పంతో కనిపించేవారు.
ఇంతకాలం ఏమన్నా కూడా ప్రజల కోసం సహిస్తూ కొనసాగుతున్నారు. ఆయన నిజాయితీగా సినిమాల్లో సంపాదించిన డబ్బును పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గర ఏ విధంగానో ఒక రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ నడుపుతున్న మొగోడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఎప్పుడూ కూడా కులాల విషయంపై ఆలోచించరు. మనమందరం భారతీయులం మనం మనిషిగా బ్రతకాలి అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.
నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం కూడా ఆయన పెట్టిన బిక్ష. ఆయన కులాన్ని చూస్తే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి తెలిసి తెలియకుండా పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుడిని మంచి వ్యక్తిని మనసున్న మనిషిపై అబండాలు వేయకండి. నేను జనసేన అభ్యర్థిని కాదు.. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానిని.. అని బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు.