గొడవల్లో బయటపడ్డ పవన్ కళ్యాణ్ క్రీస్తు కథ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా కోట్లాది మంది అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోతారు
By: Tupaki Desk | 27 Dec 2023 5:26 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా కోట్లాది మంది అభిమానిస్తూ ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోతారు. రాజకీయాలలోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది. అదే సమయంలో పవన్ ని ద్వేషించే వారి సంఖ్య కూడా పెరిగింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని దెబ్బ తీసేందుకు ప్రత్యర్ధి పార్టీలు రకరకాలుగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు సంధిస్తూ ఉంటారు.
గతంలో పవన్ కళ్యాణ్ మాటలు, చేసిన సినిమాలని కూడా బయటకి తీసుకొచ్చి తిరిగి అతని మీద విమర్శనాస్త్రాలుగా సందిస్తారు. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రీస్తు కథ సినిమాని ఎనౌన్స్ చేసి ఆపేశారు. 2010లో ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ కూడా ఫిక్స్ అయ్యారు.
అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా చేయడంపై పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపారు. తరువాత ఈ ప్రాజెక్ట్ ఊసులేకుండా పోయింది. చర్చలోకి కూడా రాలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది అనేదానిపై కూడా క్లారిటీ లేదు.
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా హిందుత్వ స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ జీసస్ పైన కూడా తనకున్న భక్తిని చూపిస్తారు. తన భార్య పిల్లలు క్రిస్టియన్స్ అని చెబుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొట్టు పెట్టుకోవడాన్ని ఓ వర్గం వారు కావాలని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో క్రీస్తు కథతో పవన్ కళ్యాణ్ చేస్తానని ఎనౌన్స్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.
క్రీస్తు కథ తరహాలోనే పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తానే హీరోగా సత్యాగ్రహి అనే మూవీ స్టార్ట్ చేసి ఆపేశారు. ఆ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో పొలిటికల్ సెటైరికల్ మూవీగా చేయాలని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ లో ఉన్న సామాజిక దృక్పథానికి అద్దం పట్టే ఈ సినిమాలు వచ్చి ఉంటే ఆయన ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.