Begin typing your search above and press return to search.

పవన్.. ఈ సినిమాలతో ఆపేస్తాడా?

అది జరగాలంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మూడు సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి పరిస్థితి నెలకొని ఉంది.

By:  Tupaki Desk   |   5 Jun 2024 3:58 AM GMT
పవన్.. ఈ సినిమాలతో ఆపేస్తాడా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా నిలబడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే మాట వినిపిస్తోంది.

ఓ విధంగా దేశంలో ఇన్నేళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100 % స్ట్రైట్ రేట్ తో సాధించి రికార్డ్ గెలుపుని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తనతో పాటు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో ప్రజలు తనకి పెద్ద బాధ్యత ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ గెలుపుని బాధ్యతగా తీసుకొని ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీలని నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు.

పవన్ కళ్యాణ్ మాటల బట్టి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని అర్ధమవుతోంది. అది జరగాలంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మూడు సినిమాలని వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి పరిస్థితి నెలకొని ఉంది. వీటిని ఎంత వేగంగా పూర్తి చేస్తాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అవకాశం ఉంటే ఈ ఏడాదిలోనే మూడు సినిమాలు పూర్తి చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగం కావాల్సి ఉంటుంది.

ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో ఇద్దరు దర్శకుల కథలు విని రెడీగా ఉంచారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ అయితే కచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేడా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు సైతం ఈ ఐదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని కోరుకోకపోవచ్చు.

ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయితే ఈ రెండేళ్లు అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. పవన్ కళ్యాణ్ కి జనసేన అభిమానులు కూడా పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగానే చూడాలని ప్రస్తుత పరిస్థితిలో కోరుకుంటున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖ తీసుకోవడంతో పాటు జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే 2029 ఎన్నికలకి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే పవన్ అప్పుడప్పుడు ఒక సినిమా చేసినా చాలని మరికొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.