పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు
By: Tupaki Desk | 18 Nov 2023 9:55 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలే కాదు పాలిటిక్స్ లో కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నారు. జనసేన అధినేతగా ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్న పవన్ రాబోయే ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాలకు ఒక లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటుగా హరి హర వీరమల్లు సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి. ఓజీ మొదలైంది మొదలు స్పీడ్ గా లాగించేస్తున్నారు.
డిసెంబర్ కల్లా ఆ సినిమా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు కానీ అది జరిగేలా లేదు. ఓ పక్క హరీష్ శంకర్ సినిమా కూడా కనీసం ఐదారు నెలలు లేట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎలక్షన్స్ అయ్యేంతవరకు పవన్ సినిమాలు చేయకూడదని అనుకుంటున్నారట. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దర్శక నిర్మాతలు కన్ ఫ్యూజన్ లో పడ్డారు.
హరీష్ శంకర్ కి అయితే నువ్వు మరో సినిమా చేసుకోమని చెప్పాడట. అందుకే హరీష్ శంకర్ రవితేజతో సినిమాకు రెడీ అవుతున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ 2024 సమ్మర్ కల్లా అయినా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. అయితే ఎలక్షన్స్ తర్వాత అంటే ఏపీలో నెక్స్ట్ ఇయర్ మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో అప్పటివరకు సుజిత్ కూడా వెయిట్ చేయక తప్పదు.
క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా విషయంలో కూడా పవన్ అదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి పవన్ వల్ల ఆయనతో సినిమా చేయాలని అనుకున్న దర్శక నిర్మాతలు కూడా ఈ ఆరు నెలలు వెయిట్ చేయాలి తప్పదనిపిస్తుంది. హరీష్ శంకర్ రవితేజ సినిమా ఓకే అయితే పర్లేదు కానీ ఆల్రెడీ రెండేళ్ల నుంచి పవన్ సినిమా కోసం ఎదురుచూసిన హరీష్ శంకర్ కి మరో ఆరు నెలలు సినిమా షూటింగ్ ఆపేసే పరిస్థితి వచ్చింది. నిర్మాతలు కూడా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి పవన్ మళ్లీ డేట్స్ ఇచ్చే వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. సో 2024 సమ్మర్ తర్వాతే పవన్ సినిమాల సందడి ఉంటుందని చెప్పొచ్చు.