Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలు.. ఇలా ఐనా జరగచ్చు?

పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు.

By:  Tupaki Desk   |   10 May 2024 3:57 AM GMT
పవన్ సినిమాలు.. ఇలా ఐనా జరగచ్చు?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకొని పెండింగ్ సినిమా షూటింగ్ లు పూర్తి చేసే పనిలో ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ, క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.

ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేసేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ప్రస్తుతం మరో కొత్త టాక్ తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మూడు నెలల పాటు గ్యాప్ తీసుకోనున్నారంట. ఏ విధంగా చూసుకున్న సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి మాత్రమే అతను కమిట్ అయిన సినిమాలకి కాల్ షీట్స్ ఇవ్వనున్నారనే మాట వినిపిస్తోంది. ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అలాగే హరిహర వీరమల్లు ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అవుతుందని రీసెంట్ గా టీజర్ తో కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు 2024లో ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ లేనట్లు కనిపిస్తోంది. ఓజీ మూవీ రిలీజ్ ని 2025 ఆరంభంకి వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే హరిహర వీరమల్లు సినిమా 2025 సమ్మర్ లో ఉండొచ్చనే మాట వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ బట్టి ఈ సినిమాల రిలీజ్ ఆధారపడి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ వెనక్కి వెళ్లడం వలన అది ఎన్టీఆర్ దేవర చిత్రానికి కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే అదే డేట్ కి ఇతర భాషలలో కూడా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ కి తీసుకొచ్చే ప్రయత్నం నిర్మాతలు చేస్తున్నారని కొత్త టాక్ పుట్టుకొస్తోంది. ఓజీ వాయిదా పడటంతో ఇప్పుడు దేవర మూవీకి పెద్ద పోటీ ఉండదు. ఇది కచ్చితంగా బెస్ట్ ఛాన్స్ అవుతుందని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. ఒకవేళ పవన్ సినిమాలు లేకపోయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆ తరువాత సినిమాలు కాస్త ఆలస్యం అయినా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరేమో.