ఇక పవన్ సినిమాలన్నీ అప్పుడే.. బిగ్ గ్యాప్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Oct 2023 9:56 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ నెల వారాహి యాత్ర అయిన తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న OG బ్యాంకాక్ షెడ్యూల్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. వీలైనంత వేగంగా ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి ఏపీలో ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు.
ప్రస్తుతం కాకినాడ తీరంలో OG మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. విలన్ గ్యాంగ్ కి సంబందించిన సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక సినిమా వచ్చే ఛాన్స్ ఉందని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. కాని ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా రెండు సినిమాల షూటింగ్స్ ఇంకా పూర్తి కాలేదు.
OG మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఎలక్షన్స్ ముందు ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మార్చి తర్వాతే థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. నవంబర్ లోపు రెండు సినిమాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్లుగానే కాల్ షీట్స్ ఇచ్చారు. నాలుగో విడత వారాహి యాత్రని తాజాగా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. ఈ యాత్ర అనంతరం డైరెక్ట్ గా OG షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందంట. మొత్తానికి అస్సలు విశ్రాంతి లేకుండా ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు మ్యానేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు.
ఈ కష్టం రెండు చోట్ల ఫలితాన్ని ఇస్తుందో లేదో అనేది వేచి చూడాలి. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కష్టానికి రిజల్ట్ వస్తే నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్తారు. రాజకీయాలలో ప్రతిఫలం వస్తే ఆయన అసెంబ్లీలో అడుగుపెడతారు.