Begin typing your search above and press return to search.

ఓజీ కోసం సుజిత్ మరో పెర్ఫెక్ట్ ప్లానింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:26 AM GMT
ఓజీ కోసం సుజిత్ మరో పెర్ఫెక్ట్ ప్లానింగ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. ఎన్నికలకి ముందే పూర్తి చేయాలని సుజిత్ భావించినప్పటికి వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా ఓజీ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత వీలైనంత వేగంగా షూటింగ్ స్టార్ట్ చేయాలని సుజిత్ భావించారు.

అయితే పవన్ కళ్యాణ్ విజయం మళ్ళీ ఒక్కసారిగా ప్లాన్స్ ను మార్చేసింది. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఐదు మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నారు. వీటికి సంబందించిన కార్యాచరణ కూడా మొదలు పెట్టారు. మొదటి రోజే 15 గంటలకు పైగా అధికారులతో సమీక్షలు, గ్రామసమస్యలపై చర్చలు జరిగాయి.

చూస్తుంటే పవన్ కు అసలు గ్యాప్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ కి డేట్స్ ఎప్పుడు ఇస్తారా అని సుజిత్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో 5 యాక్షన్ సీక్వెన్స్, 2 సాంగ్స్ ఉన్నాయంట. వాటిలో 4 యాక్షన్ సీక్వెన్స్ ఆల్రెడీ షూట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి హైదరాబాద్ షెడ్యూల్ లో కంప్లీట్ అయ్యింది. ఒకటి పూణేలో చిత్రీకరించారు.

అయికిడో, కర్మాగ బ్యాక్ డ్రాప్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందంట. రెండు యాక్షన్స్ సీక్వెన్స్ ని బొంబాయి నేపథ్యంలో షూట్ చేశారంట. ఓజీ క్యారెక్టర్ కి సంబంధించి ఈ యాక్షన్ ఘట్టాలు ఉంటాయంట. ఇంకా ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఫారిన్ లో షూట్ చేయాల్సి ఉందంట. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయంట. ఓజాయ్ గంభీర క్యారెక్టర్ కి సంబంధించి ఎలివేషన్ సాంగ్ ఒకటి కాగా మరొకటి హీరో, హీరోయిన్స్ మీద డ్యూయెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ మూవీ పెండింగ్ షూట్ కోసం 25 రోజుల కాల్ షీట్స్ ఇస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. సుజిత్ పవన్ కళ్యాణ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇంకా ఖరారు కాకపోవడం, మూవీపైన బిజినెస్ కంప్లీట్ కాకపోవడంతో 2025కి ఓజీ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. ఓజీ మూవీ కంటే ముందుగానే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పవన్ కళ్యాణ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంట. డిసెంబర్ లో ఆ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం భావిస్తున్నారు.