Begin typing your search above and press return to search.

ఓజీకి సమస్యేంటి?

'ఓజీ' ఆ రోజు రాదన్న సమాచారంతోనే నాగవంశీ 'లక్కీ భాస్కర్'‌ కోసం ఆ డేట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పవన్ ఎలాగూ ఫ్రీ అవుతాడు.

By:  Tupaki Desk   |   31 May 2024 6:17 AM GMT
ఓజీకి సమస్యేంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల తర్వాత రెండేళ్లు విరామం తీసుకుని.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చాక ఆయన అభిమానులను అత్యంత ఎగ్జైట్ చేసిన సినిమా ఏది అంటే.. 'ఓజీ' అనే చెప్పాలి. వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసిన పవన్.. స్ట్రెయిట్ మూవీ చేయడం, పైగా సుజీత్ లాంటి స్టైలిష్ యంగ్ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేయడంతో పవన్ అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది.

అప్పటికే ఉన్న హైప్‌.. ఈ చిత్ర టీజర్ రిలీజయ్యే వేరే లెవెల్‌కు వెళ్లింది. చేతిలో ఉన్న మిగతా చిత్రాలను పక్కన పెట్టి మరీ పవన్ ఈ సినిమాను చకచకా పూర్తి చేశాడు. పవన్ ఇంకొన్ని రోజులు టైమిస్తే గత ఏడాదే ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించేది కూడా. కానీ పవన్‌కు వీలు పడక సినిమా వాయిదా పడింది. ఈ ఏడాది సెప్టెంబరు 27కు కొత్త డేట్ ఇచ్చారు.

కానీ ఆ తేదీకి కూడా 'ఓజీ' రాదనే సందేహాలు ఇప్పుడు బలంగా కలుగుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ సినిమా 'లక్కీ భాస్కర్'ను సెప్టెంబరు 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత నాగవంశీ.. పవన్‌కు సన్నిహితుడే. పవన్ ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్‌కు సితార మాతృ సంస్థ లాంటిది. కాబట్టి పవన్ సినిమా ఉండగా పోటీగా 'లక్కీ భాస్కర్'ను దించే అవకాశం లేదు. 'ఓజీ' ఆ రోజు రాదన్న సమాచారంతోనే నాగవంశీ 'లక్కీ భాస్కర్'‌ కోసం ఆ డేట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. పవన్ ఎలాగూ ఫ్రీ అవుతాడు.

మరి 'ఓజీ'ని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఇబ్బందేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే ఈ సినిమాకు డిజిటల్ డీల్ పూర్తి కాలేదని.. ప్రధాన ఓటీటీలు బడ్జెట్ పరిమితుల వల్ల ఈ ఏడాదికి కౌంటర్ క్లోజ్ చేసేశాయని.. వచ్చే ఏడాదికే స్లాట్స్ ఉన్నాయని.. భారీగా రేటు పలికే డిజిటల్ హక్కుల విషయంలో ఏదీ తేలకుండా సినిమాను రిలీజ్ చేసే సాహసం నిర్మాత చేయడని.. అందుకే సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.